హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనలో, ఓ 28 ఏళ్ల యువతి తాను నివసిస్తున్న అపార్టుమెంట్‌లోనే పక్కింటి 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
మాయమాటలతో మాయ చేసిన యువతి:
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం – యువతి మొదట బాలుడితో స్నేహం పెంచుకుంది. ఈ పరిచయం మెల్లిగా వ్యక్తిగత స్థాయికి మారింది. బాలుడిని తన ఇంటికి పిలిచి, ఆమె బాలుడికి మాయమాటలు చెప్పి లోబరుచుకుంది.
భయపెట్టిన బెదిరింపులు:
అలా పలుమార్లు తన ఇంట్లోనే మైనర్‌పై ఆమె లైంగికదాడికి పాల్పడింది. ఈ విషయం బయటకు చెబితే తనపై అత్యాచారం చేశావని చెబుతానంటూ బాలుడిని బెదిరించింది. దీంతో మైనర్ బాలుడు తీవ్ర భయాందోళనకు గురై, దీన్ని ఎవరికి చెప్పలేక మౌనంగా మిగిలాడు. తాజాగా మరోసారి అతనిపై లైంగిక దాడికి పాల్పడిందామె. అలాగే అసభ్యకరమైన పనులు చేయాలంటూ బాలుడిని బలవంతం చేసింది. కానీ వేధింపులు ఆగకపోవడంతో చివరకు తట్టుకోలేక తల్లిదండ్రులకు అసలైన నిజాన్ని తెలిపాడు.
పోక్సో చట్టం కింద కేసు:
బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద యువతిపై కేసు నమోదు చేశారు. పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై గట్టిగా చర్యలు తీసుకోవడమే ఈ చట్టం ఉద్దేశం. ప్రస్తుతం నిందితురాలిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగుతోంది.
Read also: Ponguleti Srinivas: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు