Hyderabad : గవర్నర్, ఒయు ఛాన్స్లర్ జిష్ణుదేవవర్మను(Governor Jishnu Dev Varma) లోక్ భవన్లో ఒయు ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రొఫెసర్ కుమార్(Acharya Kumar) వర్సిటీలో చేపడుతున్న కార్యక్రమాలను నివేదించారు. వర్సిటీని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని అందుకు అనుగుణంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న తీరును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు.
Read also: Telangana: పేపర్ లీక్.. నలుగురు అధికారులు సస్పెండ్?

సిఎం ఒయు పర్యటన, రూ. 1000 కోట్ల నిధుల మంజూరు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్.ఐ. ఆర్.ఎఫ్సహా అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్ లలో ఉత్తమ స్థానం కోసం ఓయూ పాలకవర్గం చేపడుతున్న చర్యలపై జిష్ణుదేవ్ వర్మ సంతృప్తి సంతోషం చేశారు. విద్య, పరిశోధన, పాలన రంగాల్లో సాధిస్తున్న గణనీయమైన పురోగతిని
ప్రశంసించారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరిలో జరగనున్న సెంట్రల్ జోన్ ఉప కులపతుల జాతీయ సదస్సుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అధికారికంగా ఆహ్వానించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ఓయూలో
సదస్సుకు ఈ ఆయా రాష్ట్రాల నుంచి ఉపకుల పతులు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, ప్రము ఖులు హాజరై ఉన్నత విద్యలో సంస్కరణలు, భవిష్యత్తుపై చర్చిస్తారని వివరించారు. అంతర్జా తీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓయూలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. దేశంలోని మహిళా ప్రముఖులు, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారితో చర్చాగోష్ఠి జరుపుతామని చెప్పారు. ఈ కార్యక్రమానికి కూడా ముఖ్యఅతిథిగా హాజరుకావాలని గవర్నరు కోరారు.
ప్రొఫెసర్ కుమార్ ఆహ్వానాన్ని స్వీకరించిన గవర్నర్ జిష్ణుదేవవర్మ విద్య, సామాజిక కార్యక్రమాలు తాను సహా జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్య సామాజిక కార్య క్రమాల్లో పాల్గొనేందుకు సంతోషిస్తానని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం సమగ్ర అభివృద్ధి సాధించాలని విద్య, పరిశోధనా రంగాల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గవర్న ర్ను కలిసిన వారిలో ఒయు ఉపకులపతి కుమార్ మొలుగరంతో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: