తెలంగాణ రాజధాని భాగ్యనగరానికి ఆధునిక రవాణా సౌకర్యం అందించిన హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)రైలు మరోసారి వార్తల్లో నిలిచింది. మెట్రోను అభివృద్ధి చేసి, ఎన్నో సవాళ్ల మధ్య నడుపుతున్న ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పుడు వెనుకడుగు వేసే సూచనలు చేస్తోంది.
ఆర్థిక భారం తాళలేక నష్టాల దిశగా
ఎల్ అండ్ టీ (L&T)ఇటీవల కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి జైదీప్‌కు ఓ లేఖ రాసి, మెట్రో నిర్వహణలో ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను వివరించింది.
అందులో సంస్థ పేర్కొన్నది ప్రకారం:
- టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం ప్రారంభంలో ఊహించిన స్థాయిలో లేదని,
- నిర్వహణ ఖర్చులకు కూడా ఇది సరిపోవడం లేదని,
- కొన్నేళ్లుగా పేరుకుపోతున్న బకాయిలు, సంస్థను ఆర్థికంగా గాడిలోంచి తప్పించాయని తెలిపింది.

ప్రభుత్వమే నిర్వహించాలి – ఎల్ అండ్ టీ సూచన
ఈ పరిస్థితుల్లో, మెట్రో సేవలను తాము కొనసాగించడం ఇక సాధ్యం కాదని, బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఎల్ అండ్ టీ వెల్లడించింది.
అంతేకాదు, మెట్రో నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక Special Purpose Vehicle (SPV) ఏర్పాటు చేసి, దానికే నిర్వహణను అప్పగించవచ్చని సూచించింది.
ఐకానిక్ ప్రాజెక్ట్ బరువైపోతుందా?
హైదరాబాద్ మెట్రో రైలు, దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మెట్రో ప్రాజెక్ట్‌లలో ఒకటి. అయితే, ప్రజలు ఊహించినంత ఆదరణ ఇవ్వకపోవడం, అలాగే కరోనా తరువాత ప్రయాణికుల సంఖ్యలో పడిన తగ్గుదల, సంస్థను ఆర్థికంగా దెబ్బతీసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో, ప్రభుత్వానికి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే, మెట్రో భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: