హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలనుకునే పర్యాటకులకు కేంద్రం భారీ ఊరటనిచ్చే వార్త చెప్పింది. భారత్ మాల పరియోజనలో భాగంగా ఎకనామిక్ కారిడార్-10 నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గోవాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే సుమారు 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. అయితే, కొత్తగా ప్రతిపాదించిన పనాజీ-బెలగావి-రాయచూరు-హైదరాబాద్ మార్గం అందుబాటులోకి వస్తే ఈ సమయం సగానికి పైగా తగ్గనుంది. సుమారు 700 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రయాణం కొత్త హైవే వల్ల కనీసం 150 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా, కేవలం 7 నుంచి 8 గంటల్లోనే గోవా చేరుకునేలా ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారిని రూపొందిస్తున్నారు.
Parent notification marriage : ప్రేమ పెళ్లి ముందు అలర్ట్, పేరెంట్స్‌కు మెసేజ్ తప్పదు!
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సుమారు రూ. 12,000 కోట్ల భారీ వ్యయంతో నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన బెలగావి-రాయచూర్ సెక్షన్‌లో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. ఈ హైవే నిర్మాణం పూర్తయితే తెలంగాణ, కర్ణాటక మరియు గోవా రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోనుంది. కేవలం పర్యాటక రంగమే కాకుండా, వాణిజ్య పరంగా కూడా ఈ కారిడార్ కీలకం కానుంది. హ్యామ్ (HAM) విధానంలో నిర్మిస్తున్న ఈ రహదారి ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి, సరుకు రవాణా వేగవంతం అవుతుంది. ఇది ప్రాంతీయ వ్యాపార వృద్ధికి మరియు కొత్త ఉపాధి అవకాశాలకు బాటలు వేయనుంది.
Manchireddy Kishan Reddy: మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పోలీసు నోటీసులు
ఈ ప్రాజెక్టులో మరో విశేషం ఏమిటంటే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సూరత్-చెన్నై ఎకనామిక్ కారిడార్‌తో ఈ హైవే అనుసంధానం కానుంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మీదుగా వెళ్లే ఈ సూరత్-చెన్నై హైవే, పనాజీ-హైదరాబాద్ రహదారికి కనెక్ట్ అవ్వడం వల్ల దక్షిణాది రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఫలితంగా పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. పనాజీ, బెలగావి, రాయచూర్ మరియు హైదరాబాద్ నగరాలను కలిపే ఈ నెట్‌వర్క్ భవిష్యత్తులో దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. త్వరలోనే ఈ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com