हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Hyderabad ai war room : హైదరాబాద్‌లో AI వార్ రూమ్ ప్రతిపాదన, సీఎం రేవంత్ కీలక ప్రకటన

Sai Kiran
Hyderabad ai war room : హైదరాబాద్‌లో AI వార్ రూమ్ ప్రతిపాదన, సీఎం రేవంత్ కీలక ప్రకటన

Hyderabad ai war room : ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో “ఏఐ వార్ రూమ్” ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక వసతులు, ఐటీ మౌలిక సదుపాయాలు కలిగిన హైదరాబాద్ ఈ వార్ రూమ్ ఏర్పాటుకు అత్యంత అనువైన నగరమని పేర్కొన్నారు.

దేశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు సమగ్ర విధానాలు అవసరమని సీఎం అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఏఐ నియంత్రణ, అభివృద్ధి, నైతిక వినియోగం కోసం జాతీయ స్థాయి “నేషనల్ ఏఐ కౌన్సిల్” ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ కొన్ని అవకాశాలు కోల్పోయిందని, కానీ ఏఐ యుగంలో ఆ తప్పు పునరావృతం కాకూడదని హెచ్చరించారు.

Read Also: Azharuddin Minister Post : అజహరుద్దీన్ పదవికి గండం ?

ఇప్పటివరకు భారత్ సాఫ్ట్‌వేర్ సేవల్లో ముందంజలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఏఐ చిప్స్ (GPU), డేటా నిల్వ వ్యవస్థలు, కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో గ్లోబల్ నాయకత్వం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఇప్పటికే (Hyderabad ai war room) అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడిస్తూ, ఇది పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల తయారీలో కీలక కేంద్రంగా మారుతుందని తెలిపారు. యువతను ఏఐ రంగంలో స్టార్టప్ వ్యవస్థాపకులుగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక “ఏఐ స్టార్టప్ ఫండ్” అవసరమని సూచించారు.

టెక్నాలజీ మార్పులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం కాకుండా, ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సులు నిర్వహించాలని సీఎం ప్రతిపాదించారు. హైదరాబాద్ వంటి నగరాలు ఇలాంటి సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870