हिन्दी | Epaper

HYD: 17,18 తేదీల్లో హైదరాబాద్లో బయో-ఆసియా సదస్సు

Saritha
HYD: 17,18 తేదీల్లో హైదరాబాద్లో బయో-ఆసియా సదస్సు

హైదరాబాద్: ఆసియా ఖండంలోనే అత్యంత కీలకమైన లైఫ్ సైన్సెస్ హైదరాబాద్ హెల్త్ టెక్నాలజీకి సంబంధించిన బయో ఏసియా సదస్సు హైదరాబాద్ లో జరగనుంది. (HYD) ఈ బయో ఆసియా 23వ ఎడిషన్, రెండు రోజుల కార్యక్రమం బ్రవరి 17,18వ తేదీల్లో హైదరాబాద్లో జరగనున్నది. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ, ఔషధాలు, హెల్త్ లకు చెందిన నిపుణులు, ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ బయో ఆసియా సదస్సును తెలంగాణ (TG) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో సంయుక్తంగా కలిసి ప్రారంభించనున్నారు.
ఏఐ, ఆటోమేషన్ బయాలజీ వెల్యూషన్’ అనే థీమ్ మీద సదస్సు జరగనున్నది. మనిక సాంకేతికత వ్యవస్థ హెల్త్ ఇండస్ట్రీలో ఎటువంటి కార్పులు తీసుకువస్తుందనే అంశంపై కీలక చర్చలు ఈ సదస్సులో జరగనున్నాయి. ఆమెన్, సానోఫీ, ఎలీ లిల్లీ, కానీ బయోటెక్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ నదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు.

Read Also: Telangana Development: రెండేళ్లలో పట్టణాలకు రూ.17వేల కోట్లు

కీలక రంగాలపై అంతర్జాతీయ నిపుణుల ప్రసంగాలు

బయో టెక్నాలజీ, ఔషధాలు, ఆరోగ్య సేవలు, మెడికల్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి రంగాల మీద కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సులో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సి ల్వేనియాకు చెందిన క్యాన్సర్ జీన్ థెరపీ నిపుణులు ప్రొఫెసర్ బ్రూస్ ఎల్. లెవిన్, అమైన్ సంస్థ సీఎస్ వో డా. హోవర్డ్ వై. చాంగ్, జర్మనీకి చెందిన మిలైనీ బయో టెక్ వ్యవస్థాపకులు డా. స్టెఫాన్ మిల్లైనీ, సానోఫీ సంస్థ ఈవీపీ మాడలీన్ రోచ్ వంటి ప్రముఖులు కీలకంగా మాట్లాడనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ కూడా హాజరుకానున్నారు.

HYD: 17,18 తేదీల్లో హైదరాబాద్లో బయో-ఆసియా సదస్సు
The Bio-Asia conference will be held in Hyderabad on the 17th and 18th of February.

అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ప్యానల్ చర్చలు

(HYD) భారత ప్రభుత్వ ప్రధాన సలహాదారు(సైన్స్) ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డా. రాజీవ్ సింగ్ రఘువంశీ ఈ బయో ఆసియాలో ప్రసంగించనున్నారు. ‘ఫార్మా బయోటెక్ ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్నాలజీ, టెక్బయోపై నిపుణల చర్చలు భవిష్యత్తు’ అంశంపై ఒక ప్రత్యేక సీఈఓ కాన్ క్లేవ్ నిర్వహించనుండగా, అందులో డాక్టర్ రెడ్డీస్, జైడస్, బయోకాన్, సిప్లా వంటి భారతీయ ప్రముఖ సంస్థల సీఈఓలు పాల్గొననున్నారు. అలాగే నోవార్టిస్, రోష్, నోవో నార్డిస్క్ మెడ్ట్రానిక్, మెర్క్, అస్ట్రోజెనెకా వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ప్యానల్ చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో ప్రధానంగా కొత్త తరహా బయోలాజిక్ ఔషధాలు, సెల్ జీన్ థెరపీలు, ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ వంటి అంశాలపై సమాలోచనలు జరపనున్నారు.

ప్రపంచ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్

బయోఏసియా 2026 ద్వారా హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో లైఫ్ సైన్సెస్, ఆరోగ్య రంగాల్లో ప్రముఖ కేంద్రంగా మరింత గుర్తింపు పొందనుంది. గత రెండు దశాబ్దాలుగా బయో ఏషియా ఆసియాలోనే ప్రముఖ లైఫ్ సైన్సెస్, బయోఫార్మా, హెల్త్క్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో ఆసియాలో అగ్రగామి వేదికగా ఎదిగింది. ప్రతి ఎడిషన్లో ప్రపంచ స్థాయి నాయకులు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకు వస్తోంది. అత్యాధునిక శాస్త్రీయ ప్రగతిని పంచు కుంటున్నారు. ఈ థీమ్ ద్వారా బయాలజీ, డేటా, డీప్ టెక్నాలజీ కలయికతో ప్రపంచవ్యాప్తంగా ఔషధ ఆవిష్కరణలు, నిర్ధారణ పద్ధతులు, థెరపీ తయారీ, ఆరోగ్య సేవల అందజేతలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులను ప్రతిబింబిస్తుంది. టెక్బయో వల్ల వ్యాధులను అర్థం చేసుకునే విధానం, చికిత్సలను రూపకల్పన చేసే పద్ధతి, వైద్య సేవలను అందించే విధానం పూర్తిగా మార్పు చెందుతున్నది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870