HMWSSB e-Office Launch: జలమండలి అన్ని కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థను పూర్తి గా అమలు చేయాలని ఎండి అశోక్ రెడ్డి తెలియ జేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ-ఆఫీస్ను అన్ని విభాగాలలో అమలు చేస్తున్నట్లు.. దీనివల్ల కార్యాలయాల్లో సామర్థం, పారదర్శకత, బాధ్యతతో పాటు సేవల ప్రమాణాలు మెరుగుపడనున్నాయని ఆయన అన్నారు. సోమవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో జెఎండి మయాంక్ మిట్టల్తో కలిసి ఈ-ఆఫీస్ను ప్రారంభించారు.
Read Also: Majid Ebnelreza appointment : యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

ఈ-ఆఫీసు లో స్కాన్ చేసి భద్రపరచడమే
ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ ఈ-ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని, అలాగే పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి ఫైలు మాన్యువల్ గా స్వీకరించడం జరగదని ఈఆఫీస్ ద్వారా పంపించాలని అధికారులతో సూచించారు. ఈ-ఆఫీసు లో స్కాన్ చేసి భద్రపరచడమే కాకుండా వివిధ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ-ఆఫీసులో పొందుపరచడం జరుగుతుందని, సంబంధించిన అధికారి ఎవరైనా వారి విభాగపు ఫైల్స్ ఈ-ఆఫీసులో సరిచూసుకునే వెసులుబాటు ఉండడంతో పరిపాలన సులభతరం అవుతుంది.
ఒకే సమయంలో అన్ని కార్యకలాపాలను ఈ-ఆఫీస్ లో నిర్వహిస్తామని.. విడతల వారీగా అన్నీ డివిజన్లలో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఎండి వివరించారు. డిజిటలైజేషన్ వ్యవస్థ… సాంప్రదాయ మాన్యువల్ ఫైల్ మూమెంట్ విధానాన్ని పూర్తిగా డిజిటల్గా నిర్వహిస్తారు. అన్ని ఫైళ్లు ఈ-ఆఫీస్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో సృష్టించబడుతూ, ప్రాసెస్ చేయబడి, పంపబడుతూ, భద్రపరచబడతాయి. దీంతో భౌతిక ఫైళ్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పేపర్ వినియోగం తగ్గింపు.. డిజిటల్ డాక్యుమెంటేషన్, ఈనోటింగ్ మరియు డిజిటల్ అనుమతుల ద్వారా పేపర్ వినియోగాన్ని గణనీ యంగా తగ్గించడమే లక్ష్యం. ఇది పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా వ్యయ నియంత్రణకు దోహదపడుతుంది. వేగవంతమైన అను మతులు, నిర్ణయాలు ఎలక్ట్రానిక్ ఫైల్ రూటింగ్, ఆటోమేటెడ్ వర్క్ ద్వారా ఫైళ్లు ఆలస్యం లేకుండా వేగంగా ప్రాసెస్ చేయబడతాయి. అధికారులు తమ కార్యాలయ వ్యవస్థల ద్వారా ఫైళ్లను సమీక్షించి, ఆమోదం ఇవ్వగలరు. దీంతో నిర్ణయాల ప్రక్రియ వేగవంతమవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: