हिन्दी | Epaper

Harish Rao Letter: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ.. సిద్దిపేట నిధులపై ఘాటు ప్రశ్నలు!

Pooja
Harish Rao Letter: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ.. సిద్దిపేట నిధులపై ఘాటు ప్రశ్నలు!
  • నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై ఈర్షాద్వేషాలేనా
  • గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల కోసం విడుదలైన 1,070 కోట్ల రూపాయల నిధులను ఎందుకు రద్దు చేశావు..
  • ఆ నిధులను పునరుద్ధరించి సిద్దిపేట నియోజకవర్గంలో అడుగు పెట్టు..
  • కక్షపూరితంగా నువ్వు రద్దు చేసిన నిధుల గురించి.. ఆగిపోయిన పనుల గురించి మా సిద్దిపేట ప్రజలకు ఏం సమాధానం చెబుతావు..
  • సిద్దిపేట అభివృద్ధిపై ఆనాడు నువ్వు చేసిన విమర్శలను, నీ ఓర్వలేని తనాన్ని మా ప్రజలు మర్చిపోలేదు..
  • మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఒక్క పనైనా చేశారా..
  • నువ్వు ప్రారంభించేందుకు వస్తున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిధులు కూడా మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదలైనవే..
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు

Harish Rao Letter: సిద్దిపేట నియోజకవర్గంలో మీరు రద్దు చేసిన 1,070 కోట్ల రూపాయల నిధులను పునరుద్దరించి నిలిచిపోయిన అభివృద్ధి కొనసాగించాలి, సిద్దిపేటపై ఎందుకింత కక్ష రేవంత్ రెడ్డి…నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై ఈర్షాద్వేషాలేన అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఈ నెల 22న సిద్దిపేట కు వస్తున్న రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ వ్రాసారు..

Read Also:Telangana Budget: మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్

Harish Rao Letter
During the previous government, ₹300 crores were sanctioned for the construction of a veterinary college. Under the current government, the works have come to a halt.

మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత అధికారికంగా సిద్దిపేట నియోజకవర్గంలో అడుగుపెడుతున్నందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా స్వాగతిస్తున్నానని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్దిపేట పేరెత్తనిదే మీకు రోజు గడిచేది కాదని సిద్దిపేట అభివృద్ధిపై మీరు ప్రదర్శించిన ఈర్షాద్వేషాలను మా నియోజకవర్గ ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని లేఖలో పేర్కొన్నారు.. ఆనాడు కలలో కూడా సిద్దిపేటను తలచిన మీరు ఈనాడు అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సిద్దిపేట అనే నియోజకవర్గం ఒకటుందనే విషయాన్ని మరచిపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు… సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే గాకుండా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను పూర్తిగా రద్దు చేశారని, నిధులు రద్దు కావడంతో 27 నెలలుగా పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు..బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం రూ.1070.73 (ఒక వెయ్యి డెబ్బై కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు) కేటాయింపు జరిగిందని . ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి కొనసాగిస్తుండగా అర్ధాంతరంగా ఈ నిధులను మీరు రద్దు చేశారు. దీంతో పనులన్నీ ఆగిపోయాయి. చేసిన పనులకు కూడా నిధులు మంజూరు చేయకపోవడం దుర్మార్గమన్నారు… ఈ పనులన్నీ జరిగితే సిద్దిపేట భవిష్యత్తు మరోలా ఉండేది. సిద్దిపేట ప్రగతిపై కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే మీరు రద్దు చేసిన నిధులను పునరుద్దరించాలన్నారు.అర్ధాంతరంగా ఆగిన పనులు జరిగేలా చర్యలు తీసుకొని మీ గౌరవాన్ని కాపాడుకోండి.

  • సిద్దిపేట కు వస్తున్న మీకు మీరు రద్దు చేసిన ఆగిన పనుల వివరాలు..

– ప్రభుత్వ వెటర్నరీ కళాశాల
– రంగనాయకసాగర్‌ టూరిజం
– కోమటిచెరువు శిల్పారామం
– సిద్దిపేట నియోజకవర్గ ఔటర్‌ రింగు రోడ్డు
– తోర్నాలలో బిఎస్సీ అగ్రికల్చర్‌ కళాశాల
– మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం
– సిద్దిపేటలో క్రీడాకారుల కోసం స్పొర్ట్స్‌ హబ్‌
– టు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవనం
– త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవనం
– సిద్దిపేట– ఇల్లంతకుంట ఫోర్‌లేన్‌ రోడ్డు
– సిద్దిపేట– కిష్టాపూర్‌ రహదారి
– సిద్దిపేటలో మల్టీపర్పస్‌ ఆడిటోరియం
– సిద్దిపేట బ్లాక్‌ఆఫీస్‌ సమీపంలో ఇంటిగ్రేటెడ్‌ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్‌

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870