हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

HAM Roads: హ్యామ్ రోడ్లపై అపోహలు వద్దు.. టోల్ వసూల్ ఉండదు- మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి

Sharanya
HAM Roads: హ్యామ్ రోడ్లపై అపోహలు వద్దు.. టోల్ వసూల్ ఉండదు- మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా చేపడుతున్న హ్యామ్ రోడ్ల (HAM Roads) కు సంబంధించి ఎలాంటి అపోహలు వద్దని టోల్ వసూల్ లాంటి ది ఏమి లేదని రోడ్లుభవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం హైదరా బాద్లో మీడియాతో మాట్లాడుతూ హ్యామ్ రోడ్లపై (HAM Roads) సిఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని, కేబినెట్లో 5,190 కి.మి.ల నిడివితో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎక్కువ ట్రాఫిక్ ఉన్న అవసరం ఉన్న చోట 14 ప్యాకేజీల్లో ఆగస్టు చివరి నాటికి టెండర్ కాల్ ఫర్ (Tender Call for) చేసేలా ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరంచారు.

HAM Roads: హ్యామ్ రోడ్లపై అపోహలు వద్దు.. టోల్ వసూల్ ఉండదు- మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి
HAM Roads: హ్యామ్ రోడ్లపై అపోహలు వద్దు.. టోల్ వసూల్ ఉండదు- మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి

72 మందికి ఈ.ఈ లుగా ప్రమోషన్

సిఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేయగానే సెప్టెంబర్ నాటికి పనులు స్టార్ట్ చేసే అవకాశం ఉందని కొమటిరెడ్డి తెలిపారు. డిసెంబర్ జనవరి లో సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. ఆర్ అండ్ బి శాఖ (R&B department) రోల్ మోడల్ గా నిలవనుంది. సిఎంతో మాట్లాడి ఆర్ అండ్ బి లో ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్, పోస్టింగ్స్ ఇచ్చామని తెలిపారు.డి.ఈ నుండి ఈ.ఈ లుగా 72 మందికి ప్రమోషన్ ఇచ్చాం. 64 మందికి ఆల్రెడీ పోస్టింగ్స్ ఇచ్చాంఈ. ఈ ల నుండి ఎస్.ఈ లు 29 మంది ప్రమోషన్, పోస్టింగ్స్ కొత్తగా ఏ. ఈ లు 181 మందినీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేసుకున్నాం. డిపార్ట్మెంట్ బలోపేతం పై చర్చించడం జరిగింది. అందరూ బాగా పని చేయాలని ఇవాళ దిశానిర్దేశం చేశాను. మెయింటెన్స్ ఆఫ్ రోడ్స్పై డిస్కస్ చేశాం. వానకాలం సీజన్ కు అలెర్ట్ గా ఉండాలని బ్రిడ్జి, కల్వర్టులు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాను. క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని ఆదేశించాను రోడ్ ప్యాచ్ వర్క్ ల కోసం ఈనెలలో 140 కోట్లు రిలీజ్ చేస్తామని మంత్రి తెలిపారు.ఈ.ఈ.ఎస్.ఈ లతో రాష్ట్రంలోని ప్రతి రోడ్ గురించి సుదీర్ఘంగా చర్చించామని అన్నారు.

రీజనల్ రింగ్ రోడ్డు కోసం ముఖ్యమంత్రితో కల్సి వెళ్లి ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నితినడ్కరీనీ కలుస్తాం. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్, చుట్టుపక్కల ముఖ చిత్రమే మారబోతోందని ఆశాభావం వ్యక్తంచేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కొమటిరెడ్డి కోరారు. కేసీఆర్ వస్తే అన్ని అంశాలపై చర్చ జరుపుతామని ఆయన అన్నారు. హరీర్రావు, కెటిఆర్లతో మాకు సంబంధం లేదని అన్నారు. వాళ్లు లెక్కలోకి రారు. కెసిఆర్ మేం ఉద్యమంలో పనిచేశామని ఆయన తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే హరీశ్రావు ఉత్తి ఎమ్మెల్యే అని ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదని అన్నారు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిలదీశారు

Read also: HMDA: రక్షణ శాఖకు 435 ఎకరాల హెచ్ఎండిఎ భూములు

Read hindi news: hindi.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870