हिन्दी | Epaper

Groundnut Farmers Protest: మార్కెట్ మాయాజాలానికి బలవుతున్న వేరుశనగ రైతులు

Tejaswini Y
Groundnut Farmers Protest: మార్కెట్ మాయాజాలానికి బలవుతున్న వేరుశనగ రైతులు

Groundnut Farmers Protest: రైతులు ఆరుగాలం కష్టపడి వేరుశనగ రైతులకు మద్దతు ధర రావడం లేదు. రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో కొద్దిమేర సాగవుతోంది. అయితే వేరుశనగ విస్తీర్ణం తగ్గినా, మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నా వ్యాపారుల మాయాజాలం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని ఏ వ్యవసాయ మార్కెట్లో మద్దతు ధర రావడం లేదు. మార్కెట్ కు రైతులు అమ్మకానికి తీసుకువస్తే వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. మార్కెట్కు తీసుకువచ్చిన వేరుశనగకు ధర రాక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read Also: Israel Iran War: 50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి

Groundnut Farmers Protest: Groundnut farmers succumbing to market magic
Groundnut Farmers Protest: Groundnut farmers succumbing to market magic

మార్కెట్ వ్యాపారులు సిండికేట్ రావడంతో రైతులు నష్టపోతున్నారు. మార్కుఫెడ్ ద్వారా మక్కలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వేరుశనగకు క్వింటాలుకు 7263 రూపాయల మద్దతు ధర నిర్ణయించింది. అయితే ఈ ధర రైతులకు అందడం లేదు. మార్కెట్కు తెచ్చిన వేరుశనగకు రూ.500 నుంచి రూ.700 వరకు ధర తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో రైతులు భారీగా నష్టపోతు న్నారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం మాత్రం లేదని వాపోతున్నారు.. మద్దతు ధర ఉన్న వ్యాపారులు తక్కువకు కొనుగోలు చేస్తున్నారని, కొద్దిమంది రైతులకు మద్దతు ధర ఇస్తూ మిగతా వేరుశనగ రైతుల వద్ద ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మద్దతు ధరకు మించి ధర పెట్టి కొనుగోలు చేయాల్సి ఉన్నా వ్యాపారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండి పడుతున్నారు. ప్రధానంగా వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వేరుశనగ కొనుగోలు చేసే వ్యాపారులు సిండికేట్ కావడం వల్ల ధర రావడం లేదు. మార్కెట్ కు ప్రతిరోజు వేరుశనగను రైతులు తీసుకువస్తున్నారు. ఈ వ్యాపారులు కొనుగోలు చేస్తూ ధర మాత్రం పెట్టడం లేదు. ప్రతీరోజు మార్కెట్ కు వచ్చే వేరు శనగను పరిశీలిస్తున్నారు. ఒకరు లేదా ఇద్దరు రైతులకు సంబంధించి మద్దతు ధరకు మించి క్వింటాలు రూ.8 వేల నుంచి రూ.10 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. మిగతా రైతులంతా క్వింటాలు రూ.6500 నుంచి రూ.7 వేల మధ్యనే కొంటున్నారు. కొంత మంది రైతులది తేమ ఉందని క్వింటాలు రూ.5 వేల నుంచి రూ. 6500 మధ్యనే కొనుగోలు చేస్తున్నారు.

మార్కెట్ కు తెచ్చిన రైతులు మళ్లీ తిరిగి తీసుకొని వెళ్లలేక వచ్చిన ధరకు అమ్మకాలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో పల్లి ధర క్వింటాలు రూ.10వేల వరకు పలుకుతున్నా వరంగల్ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్గా మారడంతో ధర రావడం లేదు. కేసముద్రం, మహబూబాబాద్ పాటు ఇతర మార్కెట్లో ఎక్కువ ధరలు వస్తున్నా ఎనుమాముల మార్కెట్లో మాత్రం రావడం లేదు. ఈ అన్యాయంపై వేరు శనగ తీసు కొచ్చిన రైతులు అధికారులతో పాటు ప్రజాప్రతి నిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అయితే మార్కు ఫెడ్ ద్వారా వేరుశనగ కొనుగోలుకు ఆదేశాలు రాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

అచ్చంపేటలో రైతుల నిరసన..

వేరుశనగకు గిట్టుబాటు ధర కలినపంచాలని అచ్చంపేట రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం పట్టణంలోని. అంబేడ్కర్ కూడలిలో బైకాయించి రాస్తారోకో చేపట్టారు. 301 మంది రైతులు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్కు వేరుశనగ తీసుకొచ్చారు. మొదటిరకం వేరుశనగకు రూ. 9147, మధ్యరకం క్వింటాల్కు రూ.7179. మూడో రకం క్వింటాల్కు రూ.5009గా ధర నిర్ణయించారని వెల్ల డించారు. అయితే 20 రోజుల క్రితం వరకు సుమారు 14వేలు పలికి ధర ఇప్పుడు ఏకంగా 9వేలకు పడి పోవడంపై అధికారులను రైతులు నిలదీశారు. అధికా చులు స్పందించకపోవడంతో నిరసనకు దిగారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870