భారీ వర్షాలకు నీట మునిగిన చేలు
హైదరాబాద్ : వర్ష బీభత్సం(For heavy rains) అన్నదాతకు అపారనష్టాన్ని మిగిల్చింది. ఎక్కడికక్కడ వరదనీటిలో పంటలు కొట్టుకుపో యాయి. పలుచోట్ల పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరి, పత్తి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.10 లక్షల ఎకరాల్లోని పంటలకు నష్టం జరిగినట్టు తెలుస్తున్నది. దీంతో వేలాదిమంది రైతులకు తీరని నష్టం మిగిలింది.
పత్తి, వరి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం
ఇందులో 1.80 లక్షల ఎకరా ల్లోని పత్తి చేలు నీట మునిగాయి. అలాగే మరో 1.30 లక్షల ఎకరాల్లో వరిచేలు వరద ముంపునకు గురైంది. ప్రధానంగా రాష్ట్రంలోని మెదక్, సంగా రెడ్డి, నల్లగొండ, కొత్తగూడెం, జనగాం, మహ బూబాబాద్, వరంగల్, సూర్యాపేట్, ములుగు, ఖమ్మం, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, హన్మకొండ తదితర జిల్లాల్లో అత్యధికంగా పంటలు నీట మునిగాయి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 5 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అంచనా వేస్తున్నారు.


వాగులు, వంకలు పొంగిపొర్లిన పరిస్థతి
వాగులు, వంకలు, చెరువులు, కాల్వలు పొంగి పొర్లడంతో పొలాల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. పత్తి, మిరప, వరి, మొక్కజొన్న, కూరగాయల తోటలకు వర్షాలు, వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
పంట దశలపై వర్షాల ప్రభావం
దెబ్బతిన్న పంటలో ప్రధానంగా వరి(rice), పత్తి, కూరగాయల తోటలు అత్యధికంగా ఉన్నాయి. పత్తి పూత దశలో ఉండటం, వరినాట్లు పూర్తయిన నేపథ్యంలో వర్షాలు(For heavy rains), వరదల ప్రభావం వీటిపై తీవ్రంగా చూపించాయి. పత్తి కాత దశలో ఉండగా, పెసర చేన్లు చాలా వరకూ చివరి దశలో ఉన్నాయి. వరి పొలాలు ఇంకా నాట్ల దశలోనే ఉన్నాయి. నాట్లు దశలో వరి ఉండటంతో పలు చోట్ల ఇసుక, బురద మేటలు వేయగా, మరికొన్ని చోట్ల నీటిలో ముగినిపోవడంతో అవి కుళ్లిపోతున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో ఏకంగా ముందు తాకిడికి వేసిన వరి నాట్లు కొట్టుకుపోయాయి.
కామారెడ్డి, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో అధిక నష్టం
గత మూడు రోజుల్లో కురిసన భారీ వర్షాలకు కామారెడ్డి(Kamareddy), నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. మిగతా జిల్లాల్లోనూ పంటలకు నష్టం తప్పలేదు. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. కొన్ని చోట్ల కట్టలు తెగిపోవడంతో ఆ నీళ్లన్నీ పంట పొలాల గుండా భారీ వరదలు ప్రవహించడంతో పొలాల్లో ఇసుక మేటలు వేసింది. పొలాల్లోనే నీళ్లు నిలవడంతో పంటలు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో పంటలు నామారూపాల్లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా పంటపొలాల్లో నీళ్లు, ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో మొత్తం ఎంత ఎకరాల్లో పంట నష్టం జరిగింది?
సుమారు 4.10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
ఏ పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి?
వరి, పత్తి, మక్కజొన్న, మిరప, కూరగాయల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఖమ్మం జిల్లాలో ఎంత పంట నష్టం జరిగింది?
ఒక్క ఖమ్మం జిల్లాలోనే 5 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది.
వర్షాల ప్రభావం ఏ దశలో ఉన్న పంటలపై ఎక్కువగా పడింది?
పత్తి పూత దశలో, వరినాట్లు పూర్తయిన దశలో, పెసర చేన్లు చివరి దశలో ఉండటం వల్ల తీవ్ర ప్రభావం చూపింది.
ఏ జిల్లాలు అత్యధికంగా నష్టపోయాయి?
మెదక్, సంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, కామారెడ్డి, నిర్మల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలు అధిక నష్టం చవిచూశాయి.
Read Hindi news: Hindi.vaartha.com
Read also: