హైదరాబాద్ : తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆహారం విషతుల్యమై విద్యార్థులు తరచూ అస్వస్థతలకు గురవుతున్నారనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట సంక్షేమ గురుకులాల్లో ఆహారం విషతుల్యమై ఇటువంటి సంఘటనలు జరుగుతు న్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలోని ఖమ్మం, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రంలోని మొగుళ్లపల్లి, కల్లూరు రెబ్బెన గురుకులాల్లో ఫుడ్పాయిజన్ అయి, 65 మంది అస్వస్థతకు గురై దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉదయం కిచిడీ తిన్న 31 మంది విద్యార్థినులు కడుపు నొప్పితో బాధవడ్డారు. మొగుళ్లపల్లి పీహెచ్సీలో 18 మంది చికిత్స పొందుతుండగా, 13 మందిని అంబులెన్స్ చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అలాగే ఖమ్మం జిల్లాలోని కల్లూరులో 30 మందికి వాంతులు ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఆశ్రమ వసతిగృహంలో ఉదయం కిచిడీ తిని పాఠశాలకు వెళ్లిపోయారు. గంట వ్యవధిలోనే వారిలో 30 మంది విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. ఉపాధ్యాయులు వారిని వెంటనే సీహెచ్సీకి తరలించారు. అలాగే ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఆదివారం స్నేహితుల దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థినులు రాత్రి భోజనంచేసి పడుకున్నారు.. కొద్దిసేపటికే స్పందన, సంజన, సంకీర్తన తీవ్రఅస్వస్థతకు గురికాగా సిబ్బంది బెల్లంపల్లి దవాఖానకు (Bellampalli Hospital) తరలించారు. సంకీర్తన కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :