Telangana food poisoning: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం, గురుకులాల్లోని భోజనాలు వుడ్ పాయిజన్(Food Poisoning) అవుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అక్కడక్కడా ఫుడ్పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులుంటున్న గురుకులాలతోపాటు మధ్యాహ్న భోజనం పెడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇటువంటి ఫుడ్పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో విద్యార్థులు అనారోగ్యం(illness) పాలవుతున్నారు. కొన్ని సంఘటనల్లో కొందరు విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి సైతం గురై తరువాత కోలుకుంటున్నారు.
Read Also: BRS: మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!
పురుగులున్న ఆహారం.. పోలీస్ స్టేషన్ వరకూ విద్యార్థుల ఫిర్యాదులు
ఫుడ్ పాయిజన్(Food poisoning) ఘటనలు కాకుండా ఆహారంలో పురుగులొస్తున్నాయని, నాణ్యమైన ఆహారం అందించడం లేదని పేర్కొంటూ విద్యార్థులు ఆందోళనబాట పడుతున్నారు. మొన్న అయితే తమకు అందిస్తున్న ఆహారంలో పరుగులొస్తున్నాయని పేర్కొంటూ విద్యార్థులు నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుసైతం చేశారు. కొద్దిరోజుల క్రితం విద్యార్థినులు రోడ్డుపైకి వచ్చి గంటలకొద్ది రాస్తారోకో చేశారు.

ఇటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నాయి. గురుకులాలు, హాస్టల్స్ తోపాటు మధ్యాహ్న భోజనంలోనూ ఆహారం కలుషితం కావడానికి పలు కారణాలు ఉంటున్నాయి. భోజనం తయారిలో ఉపయోగించే కూరగాయాలు శుభ్రంగా లేకపోవడంతోపాటు.. పాడైన కూరగాయలను సైతం వంటలో ఉపయోగించడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతున్నట్టుగా అధికారుల పరిశీలనలో కొన్నిచోట్ల తేలింది. అలాగే కొన్నిచోట్ల భోజనం తయారీకి ఉపయోగించే సరుకులు గడువు ముగిసినప్పటికీ వాటిని పడేయకుండా.. అలాగే ఉపయోగిస్తుండటం వల్లకూడా ఆహారం కలుషితం అవుతున్నట్టు తేలింది. ఇవి కాకుండా ప్రధానంగా నీరు కలుషితం కావడంతో ఫుడ్ పాయిజన్ జరుగుతోంది.
పాడైన కూరగాయలు, గడువు ముగిసిన సరుకులే కారణమా?
గురుకులాలు, హాస్టల్స్ తోపాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్న నిర్వహకులు నాణ్యమైన, పరిశుభ్రమైన సరుకులను వాడకపోవడం కారణంగా కనిపిస్తుండగా.. వాటిని పరిశీలించాల్సిన వారు కూడా రెగ్యులర్గా చూడకపోవడంతో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్టు విచారణ సందర్భంగా బయటపడుతోంది. గురుకులాలు, హాస్టల్స్, పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం కలుషితం అయిన చోట్ల ఎక్కువంగా వాంతులు, విరోచనాలు కావడమే కాకుండా.. విపరీతమైన కడుపునొప్పి కూడా వస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఫుడ్పాయిజన్ జరిగిన తరువాత కొద్ది రోజుల వరకు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నప్పటికీ.. తరువాత కాలంలో తిరిగి యధావిధిగానే పరిస్థితులు కొనసాగుతున్నాయని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కలుషిత నీటితో భోజనం తయారీపై అనుమానాలు
కలుషిత ఆహారం మూలంగా విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుండటంతో విద్యార్థులతోపాటు, విద్యార్థుల తల్లిదండ్రులు అందోళన చెందుతున్నారు. గురుకులాలతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ. ఇటువంటి ఫుట్పాయిజన్ సంఘటనలు జరుగుతుండటంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. గురువారం
రాత్రి హైదరాబాద్లోని మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ కాగా శుక్రవారం మధ్యాహ్నం మాదాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితం కావడంతో విద్యార్థులు ఆనారోగ్యానికి గురి కావడంతో.. చికిత్స అందించడం కోసం విద్యార్థులను ఆసుపత్రిలో చేర్పించారు. వారిలో కొందరు విద్యార్థులకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వారికి వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
మొన్న షామీర్ పేట్లో బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లే పరిస్థితి వచ్చింది. నిన్న మాదాపూర్లోని చందు నాయక్ తాండాలో మధ్యాహ్న భోజనం వికటించి 43 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారు, బాగ్ లింగంపల్లిలో ఉన్న మైనార్టీ గురుకులంలో కలుషిత ఆహారం తిని 90 మంది ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటూ.. ఘటనలపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు.. అయినప్పటికీ రాష్ట్రంలో అక్కడక్కడా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతుండటంతో ప్రభుత్వానికి తీవ్రమైన చెడ్డపేరు వస్తోంది. ఇటువంటి ఘటనలపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: