వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని హకీంపేటలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తొలి సైనిక్ స్కూల్ స్థాపనకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) భూమిపూజ నిర్వహించనున్నారు. పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో ఏర్పడనున్న ఈ పాఠశాల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ నియమించిన నిపుణుల బృందం స్థలాన్ని పరిశీలించి అనుమతి ఇవ్వడానికి సానుకూలంగా స్పందించింది.
Read also: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. 2 గంటలు దాటితే ఫైన్!

First Sainik School in Telangana
ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు
సైనిక్ స్కూల్‌లలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యను ప్రత్యేక రూపకల్పనతో అందిస్తారు. అకడమిక్ చదువులతో పాటు క్రీడలు, శారీరక శిక్షణ, క్రమశిక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించడం వీటి ప్రత్యేకత. జాతీయ రక్షణ అకాడమీ (NDA) సహా రక్షణ దళాల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఈ పాఠశాలలు మార్గదర్శకంగా నిలుస్తాయి. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వసతి, క్రీడా మైదానాలు, శిక్షణా కార్యక్రమాలతో ఈ స్కూల్‌ను దేశంలోనే ప్రముఖ సంస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అడ్మిషన్ కోసం నిర్వహించే అఖిల భారత సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష (AISSEE) ద్వారా ఒక భాగం సీట్లను భర్తీ చేస్తారు. వైద్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం తుది జాబితా ప్రకటించబడుతుంది. PPP మోడల్ ప్రకారం 40% సీట్లు AISSEE ద్వారా, 60% సీట్లు పాఠశాల నిర్వాహకుల ప్రామాణిక నియమావళి ప్రకారం భర్తీ చేసే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 100కి పైగా PPP సైనిక్ స్కూళ్లు నడుస్తుండగా, ఇప్పుడు తెలంగాణ కూడా ఆ జాబితాలో చేరబోతోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :