తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) యువతలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకం అమలు దశలోకి ప్రవేశించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో తొలి విడతగా లక్ష మందికి రూ.50,000 వరకు లేదా లక్ష రూపాయల లోపు విలువ గల యూనిట్లకు మంజూరైన ప్రొసీడింగ్స్ జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు అందించనున్నారు.
పూర్తి షెడ్యూల్ విడుదల – శిక్షణ, ప్రారంభోత్సవాలు
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన షెడ్యూల్ ప్రకారం, జూన్ 2 నుంచి 9 వరకు యూనిట్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ పంపిణీ జరుగుతుంది. అనంతరం, జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా యువతకు తమ స్వయం ఉపాధి యూనిట్ల నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. జూన్ 16నుంచి యూనిట్లను ప్రారంభించనున్నారు.
వెనుకబడిన యూనిట్లకు త్వరలో నిధుల విడుదల
తొలి విడత అనంతరం రూ.1-2 లక్షల మధ్య, అలాగే రూ.2-4 లక్షల విలువ గల యూనిట్లకు కూడా త్వరలోనే నిధుల మంజూరు జరగనుంది. ఈ పథకం ద్వారా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతకు ఒక స్థిరమైన ఆదాయ మార్గం లభించనుండగా, రాష్ట్రంలో యువతలో ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు ఇది కీలకంగా మారనుంది.
Read Also : UPS : యూపీస్ కింద రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు