हिन्दी | Epaper

పుప్పాలగూడలో అగ్నిప్రమాదం : ముగ్గురు మృతి

sumalatha chinthakayala
పుప్పాలగూడలో అగ్నిప్రమాదం : ముగ్గురు మృతి

దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతిచెందారు. మొదటి అంతస్తులోని ఓ గదిలో చిక్కుకున్న ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతులను సిజిరా(7), సహానా(40), జమీలా(70)గా గుర్తించారు.

పుప్పాల గూడలో అగ్నిప్రమాదం

మూడు గ్యాస్‌ సిలిండర్ల పేలుడుతో ప్రమాద తీవ్రత

తొలుత భవనంలో మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న లంగర్‌ హౌస్‌ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? మంటలు ఎందుకు వ్యాపించాయనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రమాదం నుంచి మరో ఐదుగురిని కాపాడారు. భవనంలో మూడు గ్యాస్‌ సిలిండర్ల పేలుడుతో ప్రమాద తీవ్రత పెరిగింది. అయితే అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణాలు గ్యాస్ లీకేజీలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు కావొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు అదుపు చేస్తున్నాం.

అగ్నిమాపక శాఖ తెలిపినదని ప్రకారం..ఈ సాయంత్రం దాదాపు 5.30గంటల సమయంలో మాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు అదుపు చేస్తున్నాం. పైన ఐదుగురు చిక్కుకున్నట్లు చెప్పడంతో లాడర్‌ వేసి డోర్‌లు పగలగొట్టి లోపలికి ప్రవేశించాం. అక్కడ ఒక పాప, ఇద్దరు మహిళలు అపస్మారకస్థితిలో ఉండటంతో వారిని స్ట్రెచర్‌పై తీసుకొచ్చి.. అంబులెన్సులో ఆస్పత్రికి తరలించాం అని అగ్నిమాపకశాఖ అధికారి ఒకరు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870