త్వరలో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’కు నిధుల విడుదల
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం(Indiramma Barosa) కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు జూలై మొదటి వారంలో నిధులు విడుదల చేయనుంది. 4,45,304 మంది అర్హులకు రూ.261 కోట్ల ఆర్థిక సహాయం నేరుగా వారి ఖాతాల్లో జమ కానుంది. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి, కనీసం 20 రోజులు పనిచేసిన కూలీలు ఈ పథకానికి అర్హులు. ఇది పేద వ్యవసాయ కూలీలకు ఆర్థిక భరోసాను ఇస్తుంది. గతంలో రైతుభరోసా(Rythu bharosa) నిధులు కూడా విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt)ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు శుభవార్త. పెండింగ్లో ఉన్న నిధులను జూలై తొలి వారంలో విడుదల చే యాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఈ పథకం కింద, రాష్ట్రంలోని భూమి లేని వ్యవ సాయ శ్రామికులకు ఏటా2 విడతలుగా మొత్తం రూ.12 వేలు ఆర్దికసాయం అందిస్తుంది. ఇప్పటికే.. తొలి విడతలో 83,887 మంది లబ్దిదారులకు రూ. 6వేల చొప్పున నిధులు జమ అయ్యాయి. ప్రస్తుతం..మిగిలిన 4,45,304 మంది అర్హులకు సంబంధించిన సుమారు రూ.261 కోట్ల నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు జమస్తారు. ఈ పథకానికి అర్హులు కావాలంటే.. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండటంతో పాటు, కనీసం 20 పని దినాలు పూర్తి చేసి ఉండాలి. ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం, వారి జీవితాల్లో ఒక భరోసాను నింపడం. ముఖ్యంగా
వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ పనులు లేని సమయంలో ఈ ఆర్థిక సహాయం వారికి ఎంతో ఆసరాగా నిలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారిని పేదరికం నుంచి బయటపడేయడం ద్వారా సామాజిక న్యాయాన్ని అందించడమే ఈ పథకం లక్ష్యం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నిధుల విడుదలతో, లక్షలాది మంది వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఉపశమనం లభిస్తుంది. ఇప్పటికే రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా 9 రోజుల్లో రైతులకు ఎకరాలతో సంబంధం లేకుండా డబ్బులను జమ చేశారు. ఇది ఒక రికార్డుగా మంత్రి భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Also: Ramchandra Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు