हिन्दी | Epaper

Farmhouse : కేటీఆర్, హరీశ్ రావు లతో  కేసీఆర్‌ భేటీ

Saritha
Farmhouse : కేటీఆర్, హరీశ్ రావు లతో  కేసీఆర్‌ భేటీ

ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో (BRS) రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. ఈ పరిణామాల మధ్య మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఈ మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాంహౌస్‌కు (Farmhouse) వెళ్లనున్నారు. అక్కడ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వీరిద్దరితో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేటీఆర్, హరీశ్ రావులను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిట్ దర్యాప్తు దూకుడుగా కొనసాగుతుండటంతో, పార్టీ నాయకత్వం కొంత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతేకాదు, అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న చర్చ బీఆర్‌ఎస్ వర్గాల్లో జరుగుతోంది.

Read Also: Praveen Kumar: ఫోన్ ట్యాపింగ్ బ్రిటిష్ కాలం నుంచే కొనసాగుతోంది

 Farmhouse : కేటీఆర్, హరీశ్ రావు లతో  కేసీఆర్‌ భేటీ

తాజా పరిణామాలపై చర్చించనున్న నేతలు

ఈ పరిస్థితుల్లోనే కేసు తాజా పరిణామాలు, సిట్ విచారణలపై పార్టీ తీసుకోవాల్సిన వైఖరి, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై కేసీఆర్‌తో విస్తృతంగా చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. (Farmhouse) చట్టపరంగా ఎలా ముందుకెళ్లాలి, రాజకీయంగా ఎలా స్పందించాలి అన్నదానిపై నేతలు అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, నేతలు, కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాలపై మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశముందని బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు, మున్సిపల్ ఎన్నికలు… ఈ రెండు కీలక అంశాలు ఈరోజు ఎర్రవల్లి ఫాంహౌస్ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

📢 For Advertisement Booking: 98481 12870