हिन्दी | Epaper

Etela Rajender: కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకేంటి: ఈటల రాజేందర్ 

Sharanya
Etela Rajender: కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకేంటి: ఈటల రాజేందర్ 

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర బిందువైంది. ఈ సారి, బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) చేసిన వ్యాఖ్యలు భారీ చర్చలకు దారితీశాయి. ఇటీవల కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన ఈటల, తన పాత్రపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా, తనపై వస్తున్న “కేసీఆర్‌ను రక్షించేందుకు వాస్తవాలను దాచేశాడు” అన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

కమిషన్ ముందు తాను వివరించిన వాస్తవాలు:

ఆదివారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినపుడు ఆర్థిక మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటిలో తన పాత్రను కమిషన్ ముందు వెల్లడించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.

కేబినెట్ ఉప సంఘం సూచనలతోనే ప్రాజెక్టు రూపకల్పన:

ఈటల మాట్లాడుతూ, ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ ఉప సంఘం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే లేదని తెలిపారు. కాళేశ్వరంలోని అనేక ప్రాజెక్టుల రీడిజైనింగ్ను కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. త్వరలోనే అన్ని జీవోలు, సబ్ కమిటీ నిర్ణయాలు, సూచనలు బయటపెడతా అని చెప్పారు.

తుమ్మల వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత:

కాళేశ్వరం ప్రాజెక్టు అంశం అసలు కేబినెట్ ముందుకే రాలేదంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. కేబినెట్లో చర్చించకుండా ప్రభుత్వంలో ఏదీ జరగదని గుర్తుచేశారు. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్ చర్చించలేదనడం సరికాదని అన్నారు. ప్రాజెక్టు విషయంలో తీసుకున్న ప్రతీ నిర్ణయంపై కేసీఆర్ అందరితో సంతకాలు తీసుకున్నారని చెప్పారు. ఈ విషయం అప్పటి మంత్రులు తుమ్మల, జూపల్లి, కడియం శ్రీహరిలకు కూడా తెలుసని అన్నారు.

కాంగ్రెస్‌పై విమర్శలు – సీబీఐకి అప్పగించండి:

ఈటల తన వ్యాఖ్యల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. “కళంకిత రాజకీయాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించకండి. ధైర్యం ఉంటే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించండి. ఎవరు తప్పు చేసినా, తగిన శిక్ష అనుభవించాలి” అని డిమాండ్ చేశారు.

Read also: Telangana cabinet: రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులు

Fish Market: మృగశిర కార్తె- చేపల మార్కెట్లలో రద్దీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెండు రోజుల వర్షాలు, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

రెండు రోజుల వర్షాలు, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పులు

పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పులు

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు?

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

📢 For Advertisement Booking: 98481 12870