Local Body Elections Telangana: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా స్థానిక ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీకే అనుకూలంగా ఉంటాయని, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ 50 శాతం సీట్లను కూడా సాధించలేకపోయిందని అన్నారు. గెలిచిన అభ్యర్థుల్లో చాలామందిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
Read also : VC Sajjanar: వివాహాల్లో బలవంతపు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్

కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం
ఈ ఎన్నికల ఫలితాలే ప్రజల్లో కాంగ్రెస్‌పై ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తున్నాయని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ(Telangana) జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు క్వార్టర్లు మరమ్మతులు చేయడానికి, వేతనాలు చెల్లించడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం, అదే సింగరేణి నిధులతో రూ.100 కోట్లు ఖర్చుచేసి ఫుట్‌బాల్ ఈవెంట్ నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ‘హైడ్రా’ పేరిట పేదల ఇళ్లను కూల్చుతున్నారని, కానీ పెద్దలపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకన్నా ఈవెంట్ల నిర్వహణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను విస్మరించి ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో ఫుట్‌బాల్ ఆడడమే ముఖ్యమైందా? అని ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :