జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల (Etela Rajender)దీపక్ రెడ్డి ఓడిపోవడం పట్ల బీజేపీ నేత ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం వల్లే బీజేపీ ఓటమి పాలైంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ గత ఆరు నెలల నుంచి తమ ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం, బీజేపీ ప్రత్యక్షంగా దూరంగా ఉండటం వల్ల ఈ ఫలితం వచ్చిందని అన్నారు.
Read also: పైరసీపై హైదరాబాద్ పోలీసుల చర్యలకు డిప్యూటీ సీఎం ప్రశంస

ఈటల రాజేందర్ వ్యాఖ్యలు
ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఊరంతా చీకట్లో ఉన్నా కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయినప్పటికీ అధికారంలోకి వచ్చింద అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం(Etela Rajender) ఏర్పడిన తర్వాత 9 ఉప ఎన్నికలు జరిగాయనీ వాటిలో 7 స్థానాల్లో అధికార పార్టీ గెలిచినప్పటికీ బీజేపీ మాత్రం 2 చోట్ల గెలిచిందని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బులు చీరలు పంపిణీ చేసిందని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అవ్వాలని నగర సమస్యలపై ఆయనను అవగాహన చేయాలని ఖాళీగా ఉన్న ఇళ్లను వెంటనే కేటాయించాలని అభ్యర్థించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: