సంగారెడ్డి: వివిధ రకాల పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారీగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత ఉద్యోగులపై (Employees) ఉంటుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వము పలు కార్యాలయాలలో, విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వము మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఉద్యోగుల ముఖ గుర్తింపు హాజరు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమలు
ఈనెల 16 నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు హాజరు కార్యక్రమాన్ని అమలు చేయాల్సి ఉండగా యంత్ర పరికరాలను కొనుగోలో జాప్యం కారణంగా సకాలంలో అమలు కాలేకపోయింది. చేసేందుకు నిధులు లేక ఎంపీడీవోలు చేతులెత్తేశారు. ప్రభుత్వమే నిధులు మంజూరు చేయాలని అంటున్నారు. ఒక్కొక్క యంత్రం కొనుగోలుకు సుమారు 20 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. జనరల్ ఫండ్ నుండి యంత్ర పరికరాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వము సూచించినప్పటికి, మండల పరిషత్ లలో నిధుల కొరతతో యంత్రాలను ఏర్పాటు చేయడంలో ఆలస్యమవు తుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. కొందరు ఉద్యోగులు సకాలంలో విధులకు రావడంలేదని ఆరోపణలు. ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వము కార్యాలయాల్లో ముఖ గుర్తింపు హాజరు తో నైనా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు ఆశిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ అధి కా రులు పరికరాలను కొనుగోలు చేసి, ఏర్పాటు చేయాడానికి కసరత్తు చేస్తున్నారు. మండల పరిషత్ అధికారులు మాత్రం సాధారణ నిధులు లేవని అంటున్నారు. గతంలో వేలిముద్దుల హాజరు విధానం సక్రమంగా అమలు కాలేదు. ఈ క్రమంలోనే ముఖ గుర్తింపు హాజ యంత్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
ఉద్యోగుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ గుర్తింపు హాజరు యంత్రానికి జిపిఎస్ ను అనుసంధానం చేస్తారు. హాజరు నమోదుకు సంబంధించి వివరా లను రాష్ట్ర కార్యాలయానికి ప్రతిరోజు పంపు తారు. ఉదయం కార్యాలయానికి రాగానే ముఖ గుర్తింపు యంత్రములో హాజరు నమోదు చేసుకో వాలి. తిరిగి కార్యాలయ సమయం అయిపోయిన తర్వాత వెళ్లే ముందు హాజరు నమోదు చేసుకో వాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయకపోతే ఉన్నత అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విధానం అమలు అయితే సమయానికి కార్యాలయాలకు హాజరు కాక తప్పదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయి. ఈ పథకాల అమల్లో క్షేత్రస్థాయిలో మండల పరి షత్, జిల్లా పరిషత్ అధికారులు ప్రధాన భూమిక వహిస్తున్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్తు కార్యాలయాల పరిధిలో పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, ఉపాధి హామీ, ఎంపీడీవోలు, ఎంపీఓలు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సూపరిండెంట్లు, సీని యర్, జూని యర్, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, వాచ్మెన్లు ఉంటారు. వీరందరూ సమయపాలన పాటించేం దుకుగాను ఈ విధానము తోడ్పడుతుంది. సంగా రెడ్డి జిల్లాలో 26 మండల పరిషత్తులు ఉన్నాయి.ఈ విషయమై సంగారెడ్డి జెడ్పి సీఈవో జానకి రెడ్డి మాట్లాడుతూ ముఖ హాజరు యంత్రాల కొనుగోలు ప్రక్రియ సాగుతుందని,, వచ్చేనెల 1 నుంచి కొత్త విధానం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
Read also: Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలి- ఎఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్