తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చాలా చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా ముందంజలో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో(Election Results)మొదటి ఫలితం వెలువడింది. మెదక్ జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 14 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, మూడు వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా(Election Results)కొనసాగుతోంది. నందికొండ, హాలియా, చండూరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
మున్సిపాలిటీలు (116) – మొత్తం 2581 వార్డులు:
- కాంగ్రెస్: 145
- బీఆర్‌ఎస్: 71
- బీజేపీ: 17
- ఇతరులు: 15
కార్పొరేషన్లు (7) – మొత్తం 414 వార్డులు:
- కాంగ్రెస్: 2
- బీఆర్‌ఎస్: 0
- బీజేపీ: 0
- ఇతరులు: 0
లెక్కింపు కొనసాగుతోంది
ఇంకా అనేక మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతుండటంతో ఫలితాలు గంటగంటకూ మారే అవకాశం ఉంది. అధికారిక ప్రకటనల కోసం రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: