हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

రీజినల్ రింగు రోడ్డు పై కొనసాగుతున్న చర్చలు:కిషన్ రెడ్డి

Sharanya
రీజినల్ రింగు రోడ్డు పై కొనసాగుతున్న చర్చలు:కిషన్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధికి నూతన ప్రణాళికలు సిద్ధమవుతున్న వేళ, రీజినల్ రింగు రోడ్డుకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉత్తర భాగం రోడ్డు నిర్మాణానికి రూ.18,772 కోట్ల వ్యయం అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం ఆర్థిక అంచనాలు సిద్ధమయ్యాయని, కేంద్ర కేబినెట్ నోట్ తయారవుతున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధికి నితిన్ గడ్కరీ సహకారంతో 285 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులు రూ.6,280 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయని కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఈ రహదారుల ప్రారంభోత్సవం జరిపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.

Kishan reddy

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కీలక ప్రాజెక్టులు

రీజినల్ రింగు రోడ్డుతో హైదరాబాద్ చుట్టుపక్కల ట్రాఫిక్ ప్రభావం తగ్గుతుందని, పరిశ్రమలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఇది పెద్ద బూస్ట్ అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు సాగుతుండగా, కేంద్రం సహకారం అందితే పనులు వేగంగా పూర్తి కావొచ్చని భావిస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ నగరానికి పరిసర ప్రాంతాలతో కనెక్టివిటీ మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర రాజధానిని ఇతర ప్రధాన జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తుంది. ఆరాంఘర్ – శంషాబాద్ 6 లేన్ల హైవే పూర్తయింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం సిగ్నల్ ఫ్రీ రోడ్డు ఇప్పటికే పూర్తి అయ్యిందని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్ల హైవే పూర్తయినట్లు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సిగ్నల్ ఫ్రీ రోడ్డు నిర్మాణం పూర్తి బీహెచ్‌ఈఎల్ ఫ్లైఓవర్ తుదిదశకు, వచ్చే నెలలో పూర్తి ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభిస్తుందని, ముఖ్యంగా కూకట్‌పల్లి – పటాన్‌చెరు మార్గంలో ట్రాఫిక్ కట్టడికి బీహెచ్‌ఈఎల్ ఫ్లై ఓవర్ పూర్తయితే కూకట్‌పల్లి పటాన్‌చెరు మధ్య ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870