हिन्दी | Epaper

DGP: డిజిపి అర్థ వార్షిక క్రైం రివ్యూ మీటింగ్

Sharanya
DGP: డిజిపి అర్థ వార్షిక క్రైం రివ్యూ మీటింగ్

హైదరాబాద్: డిజిపి జితేందర్ అర్థ వార్షిక క్రైం రివ్యూ మీటింగ్ (Crime Review Meeting) నిర్వహించారు. డిజిపి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో శాంతి భద్రతల అదనపు డిజి మహేష్ భగవత్, పర్సనల్ విభాగం అదనపు డిజి అనిల్ కుమార్, సిఐడి చీఫ్ చారు సిన్హా రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల కొత్వాళ్లు సుధీర్బాబు, అవినాష్ మొహంతి, పి అండ్ ఎల్ ఐజి రమేష్, ఐజి చంద్రశేఖర్ రెడ్డితో పాటు డిఐజి తఫ్సీర్ ఇక్బాల్ అన్ని రేంజిల డిఐజిలు, జిల్లాల ఎస్పిలు, కమిషనర్లు పాల్గొన్నారు.

మెరుగైన షీ బృందాలు ఏర్పాటు

ఈ సందర్భంగా డిజిపి (DGP) గడచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులతో పాటు నేరాల నివారణకు పోలీసులు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. శాంతి భద్రతలు సవ్యంగా వుండడంతో పాటు అనేక కేటగిరిల్లో నేరాల తగ్గుదల వుందని డిజిపి (DGP) తెలిపారు. ప్రతీ జిల్లాలో నేరాల విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి డిజిపి వివరించారు. దీంతో పాటు సైబర్ నేరాల కట్టడికి (To curb cybercrime), ఆర్థిక నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను కూడా డిజిపి వివరించారు, విజిబుల్ పోలీసింగ్ వల్ల చాలా వరకు నేరాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రజల భద్రతకు మరింత కష్టపడి పనిచేయాలని, మహిళల భద్రతకు పెద్ద పీట వేయాలని, మనుషుల అక్రమ రవాణాను నిరోధించాలని, షీ బృందాలు, భరోసా కేంద్రాలు పటిష్టంగా వుంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని డిజిపి తెలిపారు. సమవేశం చివరి దశలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్ శిఖా గోయల్ సైబర్ నేరాలకు తమ విభాగం తీసుకుంటున్న చర్యలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సైబర్ నేరాల వల్ల అమాయకులు మోసపోతున్న తీరు, వీటిని ఎలా అరికట్టవచ్చు అనే దాని పై ఆమె పోలీసు అధికారులకు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/minister-bandi-sanjay-congress-delhi-dharna-dramas-are-only-for-muslim-reservations/telangana/527430/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్ళికి నిరాకరించిందని సైకో ప్రియుడి ఘోర నిర్ణయం

పెళ్ళికి నిరాకరించిందని సైకో ప్రియుడి ఘోర నిర్ణయం

పెంపుడు పిల్లులు కాదు పులులు.. వృద్ధురాలిని పీక్కుతిన్నాయి

పెంపుడు పిల్లులు కాదు పులులు.. వృద్ధురాలిని పీక్కుతిన్నాయి

ఇందల్వాయిలో ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో అసలు ఏం జరిగిందంటే?

ఇందల్వాయిలో ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో అసలు ఏం జరిగిందంటే?

గ్యాస్ సిలిండర్ల తరలింపు వాహనాలకు పోలీసు బందోబస్తు

గ్యాస్ సిలిండర్ల తరలింపు వాహనాలకు పోలీసు బందోబస్తు

వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్

వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్

మా చావుతోనైనా వర్సిటీ మారాలి

మా చావుతోనైనా వర్సిటీ మారాలి

పంచాయతీలకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి సీతక్క

పంచాయతీలకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి సీతక్క

తెలంగాణలో రూ. 84. 15 కోట్ల జీఎస్టీ స్కామ్?.. నిందితుడు అరెస్ట్!

తెలంగాణలో రూ. 84. 15 కోట్ల జీఎస్టీ స్కామ్?.. నిందితుడు అరెస్ట్!

రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే

రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇప్పపువ్వు సారా పై అసెంబ్లీలో చర్చిస్తాం: మంత్రి జూపల్లి

ఇప్పపువ్వు సారా పై అసెంబ్లీలో చర్చిస్తాం: మంత్రి జూపల్లి

📢 For Advertisement Booking: 98481 12870