హైదరాబాద్ : రాష్ట్రంలో 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ
కలెక్టర్లుగా ప్రభుత్వం పదోన్నతి (Promotion) కల్పించింది. ఈ సంద ర్భంగా రెవెన్యూ ఉద్యోగ సంఘాలు, జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.లచ్చి రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సంఘాల నాయకులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డిని మంగళవారం కలిసి కృతజు తలు తెలిపారు. పదోన్నతులకు ప్రత్యక్ష్యం గా, పరోక్షంగా సహకారం అందించిన సిఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిసిఎల్ఎ ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) లోకేష్ కుమార్కు, ఇతర ప్రభుత్వ పెద్దలకు పేరు పేరున రెవెన్యూ ఉద్యోగుల సంఘాల నాయ కులు ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడు తూ.. ప్రభుత్వ పరి పాలన లో కీలకమైన రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంద న్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అన్ని స్థాయి లలోని రెవెన్యూ ఉద్యో గులు కృషి చేయా లన్నారు. అన్ని క్యాడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ పదోన్నతులు రెవెన్యూ శాఖలో ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచి, ప్రభుత్వ సేవలను మరింత సమర్ధవంతంగా ప్రజలకు చేరువ చేయడానికి దోహద పడతాయ న్నారు. అనంతరం రెవెన్యూ (Revenue) ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు లచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెవెన్యూ శాఖలో పదోన్నతుల శకం మొదలైందన్నారు.

చరిత్రలోనే తొలిసారిగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం అందు బాటులోకి తెచ్చిందన్నారు. ప్రస్తుతం 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్దేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదో న్నతి కల్పించిందన్నారు. ఇదే కాకుండా సీని యర్ అసిస్టెంట్ నుంచి నయాబ్ తహశీల్దార్ వరకు పదోన్నతులను కల్పించిందన్నారు. ఈ విధంగా అన్నిస్థాయిలలో పదోన్నతులను కల్పిస్తూ రెవెన్యూ శాఖను ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు.
రాష్ట్రంలోని 10,954 గ్రామాలలో జీపీఓల నియా మకం చేపడుతుందన్నారు. ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులకే కాకుండా ప్రజలకు, రైతులకు కూడా రెవెన్యూ సేవలు సులభంగా, వేగంగా అందేలా చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శికె. రామకృష్ణ, తహసీల్దార్ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక తదితరులు పాల్గొన్నారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Double Bedroom Houses : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో ఉండని వారికి నోటీసులు!