హైదరాబాద్ ఐటీ రంగంలో మరో గ్లోబల్ మైలురాయి నమోదైంది. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ (McDonald’s) తన అత్యంత పెద్ద అంతర్జాతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (Global Capability Center – GCC) అమెరికా వెలుపల మెక్‌డొనాల్డ్స్ ఏర్పాటు చేసిన అతిపెద్ద సెంటర్‌గా నిలిచింది. ఈ కేంద్రాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
Read Also: TG: అజారుద్దీన్‌కు మంత్రి పదవి

ఈ సందర్భంగా మెక్‌డొనాల్డ్స్ (McDonald’s) ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ సెంటర్ ద్వారా కంపెనీకి కొత్త దిశ లభించనుందని తెలిపారు. ఈ కేంద్రం ప్రధానంగా ఇన్నోవేషన్, డిజిటల్ సొల్యూషన్స్, ఎంటర్‌ప్రైజ్ ఆపరేషన్స్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్, టెక్నాలజీ సపోర్ట్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈ సెంటర్ ద్వారా 1200 మందికి పైగా హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కి ఉపాధి లభించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: