Telangana Anganwadi: తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు, చిన్నారుల్లో పోషకలోపాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అంగన్‌వాడీ బడులకు వచ్చే చిన్న పిల్లలకు ఉదయం పూట పౌష్ఠికాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్నారులకు ఈ పథకం ద్వారా మేలు చేకూరనుంది.
Read Also: Homes Demolitions on Bhoodan Lands : ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?
పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
ఈ మేరకు తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.మారుమూల జిల్లాలు, ఏజెన్సీల్లోని కౌమార బాలికల్లో రక్తహీనత తగ్గించేందుకు అదనపు పోషకాహార పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈనెల 20న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శుక్రవారం (ఫిబ్రవరి 27) శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ శ్రుతి ఓజాతో కలిసి బడ్జెట్ కేటాయింపులు, అమలవుతున్న పథకాలు, ఖర్చులు, చేపట్టే కార్యక్రమాలపై జిల్లా సంక్షేమశాఖ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: