Delhi Liquor Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు నుంచి ఊరట లభించిందని భావిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చిక్కులు మొదలయ్యాయి. ఈ కేసులో కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ (CBI) సవాలు చేసింది.
Read Also: Hyderabad Water Supply: తీరనున్న నీటి కష్టాలు.. ఇక ట్యాంకర్లతో పని లేదు..!
ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ
రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాసేపటి క్రితం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉన్న కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన తాజా నోటీసులను అందజేశారు. ఆ సమయంలో కవిత ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో.. నోటీసులను ఆమె భర్త అనిల్ కుమార్‌కు అందజేసి, ఆమె ఎక్కడ ఉన్నారనే వివరాలను ఆరా తీశారు. దీంతో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని, ‘సౌత్ గ్రూప్’ తరపున కవిత కీలక పాత్ర పోషించారనే ఆరోపణలతో దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌లో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని ఈ కేసు నుండి విముక్తి కల్పిస్తూ క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే, ఈ తీర్పును సీబీఐ హైకోర్టులో సవాలు చేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: