హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించాలని ప్రయత్నించవద్దని HYD సీపీ సజ్జనార్ (CP Sajjanar) హెచ్చరించారు. ‘మా డాడీ ఎవరో తెలుసా?, మా అంకుల్ ఎవరో తెలుసా? అన్న ఎవరో తెలుసా? అని మా అధికారులను అడగొద్దు. మీ ప్రైవసీకి మర్యాద ఇస్తాం. వాహనం పక్కన పెట్టి, డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం’ అని తనదైన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
Read Also: Telugu states: కేజీ చికెన్ రూ.300.. మాంసం ప్రియులకు షాక్
ఈసారి 15 శాతం క్రైం రేట్ తగ్గింది
ఇదిలా ఉంటే.. సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉందని, ఈసారి 15 శాతం క్రైం రేట్ తగ్గిందని సీపీ సజ్జనార్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, విజిబుల్ పోలీసింగ్, నేరగాళ్లపై స్పెషల్ ఫోకస్ కొనసాగుతున్నదని చెప్పారు. పోక్సో కేసులు 27 శాతం, భార్యలపై భర్తల హింస 6 శాతం పెరిగిందన్నారు.కొన్ని నేరాల సంఖ్య పెరిగినంత మాత్రాన లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందనడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది నమోదైన నేరాలకు సంబంధించి ‘2025 వార్షిక నివేదిక’ను శనివారం సజ్జనార్ విడుదల చేశారు. ఈ ఏడాది నేరాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధించామన్నారు. ఆపరేషన్ కవచ్, డ్రోన్ల వినియోగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: