हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య

Sharanya
పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్ హబ్సిగూడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవ్వడంతో పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు పిల్లల్ని హత్య చేసి, అనంతరం ఉరేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ విషాదకర సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Crime.jpg

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మొకురాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, కవిత దంపతులు హబ్సిగూడలో నివాసముంటున్నారు. చంద్రశేఖర్ ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. అయితే గత ఆరు నెలలుగా ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఈ పరిస్థితులు భరించలేకనే పిల్లలైన శ్రిత రెడ్డి (9వ తరగతి), విశ్వాన్ రెడ్డి (5వ తరగతి)ను హత్య చేసి, తర్వాత భార్యతో కలిసి ఉరి వేసుకుని మరణించారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సూసైడ్‌ నోట్‌

పోలీసులు ఘటనాస్థలంలో దర్యాప్తు నిర్వహించగా, ఇంట్లో రెండు సూసైడ్‌ నోట్లు లభించాయి. అందులో ఆర్థిక ఇబ్బందులే తమ బలవన్మరణానికి కారణమని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గత నెల 21న కూడా వారు చనిపోవాలని భావించారని, కానీ ఆ రోజు ఆలోచన మార్చుకుని మళ్లీ జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించారని లేఖలో వివరించారు. అయితే, చివరకు ఈ నిర్ణయమే తీసుకున్నారని అందులో పేర్కొన్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, చంద్రశేఖర్‌ రెడ్డి మొదటగా తన ఇద్దరు పిల్లలకు నిద్ర మాత్రలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత గొంతునులిమి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం భయంకరమైన ఈ చర్యను ముగించుకుని దంపతులు చెరో గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీతా రెడ్డి అబిడ్స్‌లోని ఫిట్జ్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. ఆమె చదువులో ప్రతిభావంతురాలిగా పేరుంది. విశ్వాన్ రెడ్డి జాన్సన్ స్కూల్‌లో 5వ తరగతి విద్యార్థి. అతడూ చదువులో మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నాడు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న చంద్రశేఖర్‌ రెడ్డి, కవిత కుటుంబ సభ్యులు హబ్సిగూడకు చేరుకున్నారు. నలుగురిని చనిపోయిన స్థితిలో చూసి తట్టుకోలేక విలపించారు. కుటుంబంలోని పెద్దలు, బంధువులు, ఇరుగుపొరుగువారు కన్నీటి పర్యంతమయ్యారు. హబ్సిగూడ ప్రాంత ప్రజలు కూడా ఈ దారుణ ఘటన గురించి విని తీవ్ర దిగ్బంధతకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబానికి అప్పుల బాధ ఉన్నట్లు, ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఆర్థిక ఒత్తిడి పెరిగిందని పోలీసుల అనుమానం. గతంలోనూ వారు ఇలాంటి ఆలోచనలు చేసినట్లు సూసైడ్‌ నోట్‌లో పొందుపరిచిన మాటల ద్వారా తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం హైదరాబాద్ లో కలకలం రేపింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870