సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా(Constable) పనిచేస్తున్న కటారి సందీప్ కుమార్ (25) ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.సందీప్(Constable) గత కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకొని, లక్షల రూపాయల్లో అప్పు చేసి, తీర్చలేక. ఆర్థిక ఒత్తిడిని భరించలేక, మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Also: Bus Accidents: నల్లగొండ , కరీంనగర్ , సత్య సాయి లో బస్సులు ఢీ
మరణానికి ముందు “వెల్‌విషర్స్” పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ సృష్టించి, “సారీ అమ్మ, చెల్లి… నేను ఉన్నప్పుడు మీకు టార్చర్ ఇచ్చాను… ఇప్పుడు ఎవరూ మీకు ఏమీ అనకండి” అని చివరి మెసేజ్ పంపాడు.ఈ ఘటనతో సంగారెడ్డి పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి, సందీప్ వాడిన రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
అధికారులు ఆన్‌లైన్ గేమింగ్‌పై నియంత్రణ అవసరమని అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: