हिन्दी | Epaper

Councilor Neelam Shwetha Election:కౌన్సిలర్ నీలం శ్వేత ఎన్నికను రద్దు చేయాలి: చంద్రకళ

Siva Prasad
Councilor Neelam Shwetha Election:కౌన్సిలర్ నీలం శ్వేత ఎన్నికను రద్దు చేయాలి: చంద్రకళ

Councilor Neelam Shwetha Election: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 23వ వార్డులో రాజకీయ దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ నీలం శ్వేత తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఎన్నికయ్యారని, ఆమె ఎన్నికను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి చెనమోని చంద్రకళ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీవో మరియు తహశీల్దార్ కార్యాలయాల్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

Read Also: KTR warning : కేటీఆర్ ఫైర్, కాంగ్రెస్ నేతలకు భారీ హెచ్చరిక!

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 23వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ అయినప్పటికీ, ఓసీ (కాపు) సామాజిక వర్గానికి చెందిన నీలం శ్వేత(Councilor Neelam Shwetha Election) అధికారులను తప్పుదోవ పట్టించి బీసీ సర్టిఫికేట్‌తో నామినేషన్ వేసి గెలుపొందారని చంద్రకళ ఆరోపించారు. కేవలం 12 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన తనకు అన్యాయం జరిగిందని, నిబంధనల ప్రకారం శ్వేత ఎన్నికను రద్దు చేసి, తనను విజేతగా ప్రకటించాలని ఆమె అధికారులను కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె ఇదే తరహాలో తప్పుడు పత్రాలతో ఎన్నికల అధికారులను, ప్రజలను మోసగిస్తున్నారని చంద్రకళ ఈ సందర్భంగా మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870