పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం(PJR Flyover Kondapur Gachibowli Inauguration)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానులుగా పనిచేసిన పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ (Indiragandhi) హయాంలో హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేస్తూ, ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణకు కేంద్రం నుంచి ఏమి రాలేదని ఆయన విమర్శించారు. “హైటెక్ సిటీ పీవీ వల్ల, మెట్రో మన్మోహన్ వల్ల, మిథానీ, బీహెచ్ఈఎల్ లాంటి సంస్థలు ఇందిరాగాంధీ వల్ల వచ్చాయి. మరి మోదీ ఏమిచ్చారు?” అంటూ బీజేపీ నేత కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
బీజేపీ ఎంపీలను ప్రజలు గెలిపించారని గుర్తు చేసిన సీఎం
తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు బీజేపీకి ఇచ్చారని, అయితే వారు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమాత్రం ప్రాజెక్టులు తీసుకురాలేదని సీఎం ఆరోపించారు. మేం రీజనల్ రింగ్ రోడ్డు అడిగితే ఇవ్వడం లేదు, మూసీ రివర్ ఫ్రంట్ కోసం అడిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “మేము ఏం పాపం చేశాం.. మోదీ ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు?” అంటూ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభం – ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జాం సమస్యలకు పరిష్కారంగా పీజేఆర్ ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెచ్చారు. రూ.140 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ వల్ల గచ్చిబౌలి జంక్షన్ వద్ద రద్దీ తగ్గనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2022 మార్చిలో నిర్మాణం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, 2024 జూన్ 15 నాటికి పూర్తి అయింది. ఇప్పటికే అక్కడ ఉన్న రెండు ఫ్లైఓవర్లపై ఇది మూడో స్థాయి నిర్మాణంగా ప్రారంభమై, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు ఊరటనిచ్చే ప్రాజెక్టుగా నిలిచింది.
Read Also : Andhra Pradesh: మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు పంపిణీ