हिन्दी | Epaper

CM Revanth: మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం: సీఎం

Anusha
CM Revanth: మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం: సీఎం

CM Revanth: హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ (JNTU)లో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడంలో మహిళల కృషి ఎంతో ఉందని కొనియాడారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Read Also: Maoist Surrender: సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు

మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. “రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చటమే మా లక్ష్యం” అని ఆయన అన్నారు.. ఇందుకోసం మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులను నడిపించే అవకాశం కల్పించి, వారిని వ్యాపార భాగస్వాములుగా మార్చామని గుర్తు చేశారు.

CM Revanth: We will turn women into millionaires
CM Revanth: We will turn women into millionaires

చట్టాల అమలుతోనే భద్రత.. సంక్షేమంలో మహిళలకే అగ్రపీఠం

మహిళల రక్షణ కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే బాధ్యత నెరవేరుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు రాజకీయంగా పెద్దపీట వేశామని, ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870