हिन्दी | Epaper

Breaking News – CM Revanth: ఢిల్లీ లో సీఎం రేవంత్ బిజీ బిజీ .. పూర్తి షెడ్యూల్ ఇదే !

Sudheer
Breaking News – CM Revanth: ఢిల్లీ లో సీఎం రేవంత్ బిజీ బిజీ .. పూర్తి షెడ్యూల్ ఇదే !

ఢిల్లీ పర్యటన(Delhi)లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) శుక్రవారం పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్ హోటల్‌లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో తెలంగాణ–న్యూజెర్సీ మధ్య వ్యాపార, విద్యా, సాంకేతిక రంగాలలో సహకార అవకాశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది.

ఆ తరువాత ఉదయం 11:30 గంటలకు బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షిక ఫోరమ్‌లో సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ వేదికపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానాలు, పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు రాష్ట్రం అందించే అవకాశాలపై ఆయన వివరిస్తారని అంచనా. తెలంగాణను పెట్టుబడులకు అగ్రగామి రాష్ట్రంగా నిలపడం లక్ష్యంగా ఆయన ప్రసంగం ఉండనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

News Telugu:

మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్‌బర్గ్, గోద్రెజ్, ఉబర్ వంటి ప్రముఖ బహుళజాతి సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సమావేశంలో తెలంగాణ(Telangana)లో పెట్టుబడులు, ఉద్యోగ సృష్టి, కొత్త ప్రాజెక్టుల స్థాపనపై చర్చలు జరగనున్నాయి. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జ్ బ్రెండేతో ఆయన ప్రత్యేక భేటీ అవుతారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణను గ్లోబల్ స్థాయిలో పెట్టుబడిదారుల దృష్టికి తీసుకువెళ్లే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

https://vaartha.com/rasi-phalalu-today-19-september-2025/rasi-phalalu-today-horoscope/549889/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870