తెలంగాణలో మున్సిపల్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదైంది. నల్గొండ జిల్లా చిట్యాల(Chityala) మున్సిపాలిటీలోని 1వ వార్డులో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నాగిళ్ల కావేరి సుధాకర్ ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి నగేశ్‌పై 109 ఓట్ల ఆధిక్యంతో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందడం ఇదే తొలిసారి కావడంతో ఈ విజయం చారిత్రాత్మకంగా నిలిచింది.

సామాజిక సమానత్వానికి కీలక మైలురాయి
ఈ ఫలితం సామాజిక సమానత్వం, లింగ సమాన హక్కుల దిశగా తెలంగాణలో ఒక కీలక మైలురాయిగా పరిగణిస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయ ప్రాతినిధ్యం(Chityala) లేని వర్గాల నుంచి ప్రజాప్రతినిధి ఎన్నిక కావడం ప్రజాస్వామ్యంలో సమగ్రతను ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ట్రాన్స్‌జెండర్ సమాజానికి ఇది ఒక ప్రేరణగా మారనుందని, రాజకీయాల్లో భాగస్వామ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
స్థానిక ప్రజల మద్దతుతో విజయం
స్థానిక ప్రజల మద్దతుతో కావేరి సుధాకర్ ఈ విజయం సాధించారు. వార్డులో అభివృద్ధి, సంక్షేమం, సమాన హక్కుల అంశాలపై దృష్టి పెట్టాలని ఆమె ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ విజయం స్థానిక పాలనలో కొత్త దృక్పథాన్ని తీసుకువస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ చారిత్రాత్మక విజయంపై రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు అభినందనలు తెలిపాయి. ట్రాన్స్‌జెండర్ సమాజానికి రాజకీయ గుర్తింపు పెరగడం ప్రజాస్వామ్యానికి శుభసూచకమని పలువురు నేతలు వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: