Cheriyala Mobile Shop Theft: పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద ఉన్న భాస్కర్ మొబైల్ షాప్ లో మంగళవారం తెల్లవారుజామున రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం షాపు యజమాని ఎప్పటిలాగే షాపును మూసివేసి వెళ్ళాడు. తిరిగి మంగళవారం ఉదయం దుకాణం తెరిచి చూసేసరికి దుకాణం పైభాగం నుండి గుర్తు తెలియని దుండగులు లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్లు, నగదు ఎంత చోరి జరిగిందన్న విషయం తెలియాల్సి ఉంది.
Read Also: Konda Surekha: హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: