హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఖమ్మం జిల్లాకు సంబంధిచిన సాగునీటి వసతులు, భక్తులు, ప్రజల సౌకర్యానికి సంబంధించిన పలు కీలక విజ్ఞప్తులు చేసారు. రాష్ట్ర పునర్విభనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అయిదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణాలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని సోమవారం అమరావతిలో సిఎం చంద్రబాబుతో భేటీ అయిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండటం వల్ల ప్రజలు పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
Read also: TamilNadu: ఎన్నికల వేళ ప్రధానికి లేఖ రాసిన సీఎం స్టాలిన్

Give me those five villages
ఈ గ్రామాలు గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఉండటంతో ఆంధ్రప్రదేశకు చెందిన ఎంక్లేవ్స్ మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రజలు దాదాపు 8గంటలు ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర పోస్టులు, పన్నులు, పరిపాలనా అనుసంధానం లోపం, భద్రతా సమస్యలు తదితర అంశాలు స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. ఈ మేరకు అమరావతి వెళ్లిన మంత్రి తుమ్మల సోమవారం అక్కడ ఏపీ సీఎంను కలిశారు. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్ట్ శాశ్వత మరమ్మత్తులు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని విన్నవించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 16,000 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, అందులో సుమారు 13,640 ఎకరాలు (85.25శాతం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2,360 ఎకరాలు (14.75శాతం ) తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు.
గిరిజన ప్రజల సమస్యలు – పరిపాలనా అవరోధాలు
ఈ ప్రాజెక్టుతో రెండు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఖర్చును 85:15 నిష్పత్తిలో భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సాగు, జీవనాధారం ఈ ప్రాజెక్ట్ పై ఆధారపడి ఉన్నందున తక్షణ ఆర్థిక సహకారం అందించాలని విజప్తి చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరి వరద రక్షణ కరకట్టలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతిన్న విషయం కూడా మంత్రి ప్రస్తావించారు. కరకట్టలోని కొంత భాగం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లడంతో నిర్వహణలో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. తక్షణ సాంకేతిక పరిశీలన చేసి తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు రెండు రాష్ట్రాల సమన్వయంతో శాశ్వత పునరుద్ధరణ చర్యలు ప్రారంభించాలని ఏపీ సీఎంను కోరారు.
సాగునీటి ప్రాజెక్టులు, దేవాలయ అభివృద్ధి అంశాలు
ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి అవసరమైన భూమి గుర్తింపు పూర్తైందని, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కోరారు. తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక యాత్రికుల భవనం నిర్మాణానికి సుమారు 5 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రి ప్రతిపాదించారు. సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై ఎపి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: