हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Congress : రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ పాలన నడుస్తోంది – హరీశ్

Sudheer
Congress : రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ పాలన నడుస్తోంది – హరీశ్

తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీలో జరిగిన బనకచర్ల సమావేశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth)పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘అజెండాలో బనకచర్ల అంశం స్పష్టంగా ఉందని, దానిపై చర్చ జరిగింది అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంగా చెబుతున్నారు. అలాంటప్పుడు రేవంత్ చర్చ రాలేదని ఎలా చెబుతారు? ప్రజలకు అబద్ధం చెప్పడమేంటి?’’ అని హరీశ్ మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజలకు గురుదక్షిణ ఇచ్చే నేత కావాలో?

హరీశ్ రావు తీవ్రంగా మండిపడుతూ, ‘‘ప్రజలు నిన్ను రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమని ఎన్నుకున్నారు కానీ ఏపీకి గురుదక్షిణ చెల్లించమని కాదు’’ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, ఆయన ఢిల్లీకి వెళ్లడం వెనుక ఉన్న అసలు ఒప్పందాలేంటో రాష్ట్ర ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. చర్చ రాలేదని చెప్పడం బలహీనతకే సంకేతమని విమర్శించారు.

తెలంగాణలో బీజేపీ-టీడీపీ రిమోట్ పాలన నడుస్తోంది

‘‘ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా, పాలన మాత్రం బీజేపీ, టీడీపీ రిమోట్ కంట్రోల్ చేతుల్లో ఉంది’’ అని హరీశ్ రావు ఆరోపించారు. సీఎం పదవి ఉంటే ఏమిటి, నిర్ణయాలు తీసుకుంటున్నది బాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణపై జరుగుతున్న ద్రోహాన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే దీనికి తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.

Read Also : Kaleswaram : కాళేశ్వరం ఇంజినీర్ల అవినీతిపై ఈడీ ఫోకస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870