ఏకీకృత పాఠశాలలతో కులమత భేదాలు దూరం
షాద్ నగర్ : అక్షరంతోనే అభ్యుదయం వస్తుంది.. అక్షరమే మనిషి జీవితాన్ని మారుస్తుంది.. జ్ఞానం ముందు ఏ ఆస్తి పనికిరాదు… అందుకే విద్యాభివృద్ధికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యఅతిరిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఆల్పాహారం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ ఆలోచన చేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నియోజక వర్గంలో అల్పాహార పథకం పైలెట్ ప్రాజెక్టు కింద అప్పటికే ప్రారంభించామని వివరించారు. మా సంకల్పం గొప్పది ఆర్ధిక పరిస్థితులు అనుకూలిస్తే అన్ని వనరులు సమ కూరితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం పథకం ప్రవేశపెడతామని తెలిపారు.
Read Also: Municipal Elections: ‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు!

ఎదిగే వయసులో పిల్లలకు సరైన ఆహారం లేక పరిపూర్ణంగా ఎదగలేక పోతున్నారనే ఆలోచనతో ప్రభుత్వం ఈ విశగా ఆలోచన చేస్తుందని తెలిపారు. కామన్ స్కూల్ విధానం ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబం గా ఎదుగుతుంది చిన్ననాటి నుండే అందరం కలిపిపోయాం అనే భావన కులం, మతం, ధనిక, పేద తేడా లేదన్న నిర్మాణాత్మక ఆలోచన సమాజంలో పెరుగుతుందనే ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తుందని తెలి. పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్ట మొదటిసారి. ఒక్కో పాఠశాలను 25 ఎకరాలు విస్తీర్ణంలో 200 కోట్లు బడ్జెట్ తో రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 20వేల కోట్లు వెచ్చిస్తూ ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించామని వివరించారు.
సంక్షేమాల్లో ముందడుగు…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలలో ముందదును వేసిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 రోజుల వ్యవధిలోనే అధికారులతో నివేదిక తెప్పించుకొని డైజ్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. (Bhatti Vikramarka) హైదరాబాద్ చుట్టూ ఆధునిక ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుంది, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరించామని వివరించారు. రాష్ట్రంలోని మహిళలందరికీ నాణ్యమైన చీరలు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి వంపిణీ చేస్తున్నాం వారిని మహాలక్ష్మలుగా గౌరవిస్తున్నామని తెలిపారు. దివంగత వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దెందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాం మొదటి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామంటే అంతా నవ్వారు. కానీ మేం పట్టుదలతో మొదటి ఏకారి 26 వేల కోట్ల వడ్డీలేని రుణాలకు సంబంధించిన చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేసి ఇది సాధ్యమని నిరూపించినట్లు వివరించారు.
(Bhatti Vikramarka) హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఈ తరానికి తెలిసి ఉండకపోవచ్చు ఈ దేశంలో భూ సంస్కరణలకు అధ్యుడు బూర్గుల: రామకృష్ణారావు ముఖ్యమంత్రులు. బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డితో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, ప్రముఖ ప్రొఫెసర్ హ రగోపాల్ వంటి అనేకమంది ప్రముఖులను మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల దేశానికి సమాజానికి అందించిందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ప్రొఫెసర్ హరగోపాల్ విద్యాశాఖ జాయింట్. డైరెక్టర్ సోమిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి. గ్రామ సర్పంచ్ కృష్ణయ్య అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బందారి సంతోష తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: