తెలంగాణలో ప్రపంచ స్థాయి (వరల్డ్ క్లాస్) ఫిలిం సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయం వెల్లడించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), “తెలంగాణ సినీ పరిశ్రమను దేశంలోనే అత్యాధునికంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం” అన్నారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన తెలుగు ఫిలిం క్లబ్‌లో సినీ ప్రముఖులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
Read Also: Minister Ponnam: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం: పొన్నం
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గానీ, ఇప్పుడు తెలంగాణలో గానీ సినీ పరిశ్రమకు మేలు జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లేనని ఆయన స్పష్టం చేశారు.
ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ (Telugu film industry) ను హైదరాబాద్‌కు తరలించడంలో, వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయని ఆయన గుర్తుచేశారు. అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు వంటి ప్రముఖ స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వమే భూములు కేటాయించిందని వివరించారు.

కార్మికులకు ఉపాధి కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) హయాంలోనే, సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీని ఏర్పాటు చేశామని తెలిపారు.సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి హామీ ఇచ్చారు.
“హైదరాబాద్ (Hyderabad) నగరం అన్ని భాషల వారిని ఆదరిస్తుంది. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, అద్భుతమైన వాతావరణం, తక్కువ ధరకే మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. సినీ పరిశ్రమ అభివృద్ధి చెందితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది, తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది,” అని ఆయన పేర్కొన్నారు.
మా అసోసియేషన్ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు అంశంపై ఎఫ్‌డీసీ చైర్మన్‌తో మాట్లాడి, ప్రభుత్వ సహకారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మంచి చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా ప్రోత్సాహం అందుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: