భారత్ సమ్మిట్‌కి రంగం సిద్ధం: తెలంగాణను గ్లోబల్ మోడల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: ప్రోగ్రెసివ్ ఆలోచనకు వేదికగా, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక మోడల్‌గా చూపించేందుకు “భారత్ సమ్మిట్”ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గురువారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వారు ఈ సమ్మిట్‌ను రాష్ట్ర అభివృద్ధి, శాంతి, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కాంగ్రెస్ మూల సిద్ధాంతాలపై చర్చించేందుకు ఉపయోగపడే గొప్ప వేదికగా అభివర్ణించారు.ఈ రెండు రోజుల సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీ నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్‌ట్యాంకర్లు సహా 450 మంది ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి ప్రముఖులను కూడా ఆహ్వానించారు.సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షించారు. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేకంగా వివరించేందుకు ప్రత్యేక సెషన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందిరా మహిళ శక్తి బజార్లు, గ్రామీణ ఉపాధి కల్పన, యువతకు న్యాయం వంటి అంశాలపై స్పష్టమైన దృష్టితో వివరణ ఇవ్వనున్నారు.

Telangana : తెలంగాణ అభివృద్ధిని ప్రపంచానికి చాటే వేదికగా భారత్ సమ్మిట్
ఈ సమావేశంలో ఎకనమిక్ జస్టిస్, సోషియల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, జెండర్ జస్టిస్, ఎకలాజికల్ జస్టిస్, యూత్ జస్టిస్, పీస్ జస్టిస్ అనే అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచమంతటినుండి వచ్చిన ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వ దృక్పథాన్ని వివరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టారు. కోల్డ్ వార్ సమయంలో భారతదేశం అనుసరించిన అలీన విధానాన్ని గుర్తు చేస్తూ, భారతదేశం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో గౌరవించిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు.ఈ సందర్భంగా మినాక్షి నటరాజన్, మధుయాష్కీగౌడ్, ఎఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలు సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణను గ్లోబల్ రోల్ మోడల్‌గా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఎంతో కీలకమవుతుందని వారు తెలిపారు.
Read More : AP Govt : ఏపీలో స్పౌజ్ పింఛన్లు… ఈరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ