భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సోమవారం రోజు జరగనున్న తెప్పోత్సవానికి విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఆలయ అధికారులు ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించారు. తెప్పల నిర్వహణ, విద్యుత్ వ్యవస్థ, భద్రతా చర్యలను పరిశీలించి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.
Read also: CP Sajjanar: మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదు

Bhadrachalam
ఎల్లుండి జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఆలయ యాజమాన్యం వెల్లడించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రతా బందోబస్తును మరింత బలోపేతం చేశారు. ఈ పర్వదినాన 60 నుంచి 80 వేల మంది వరకు భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేయడం భక్తులకు విశేష పుణ్యఫలాన్ని ఇస్తుందని ఆలయ పండితులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: