హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి బిసి గురుకులాలో (BC Hostels) పరిస్థితలు దారుణంగా ఉన్నాయని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ అన్నారు. బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసి వినతి పత్రం అందిం చారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

గురుకులాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
రాష్ట్రంలోని గురుకులాలలో(BC Hostels) ఫుడ్ పాయిజన్ (Food poisoning) ఘటనలు, పాములు, తేళ్ల వంటి విషపు పురుగుల వల్ల మరణించిన ఘటనలతో పాటు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మరికొన్ని చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. విషయాలపై గతంలో కూడా మేము అనేకసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాం. కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని ఒత్తిడి చేశామన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మేము అధికారులను కలిసి మరోసారి విజప్తి చేశాం. ఈ మళ్లీ ఏర్పడకూడదని చెప్పాం. కానీ ఈ 10 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ బిసి గురుకులాలలో దాదాపు 10మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి (Students are ill) గురయ్యారు.
వారిలో ఏడుగురు ఇప్పటికే మృతి చెందగా, ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఒక విద్యార్థికి రెండు కాళ్లు, నడుము విరిగిపోయిన పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్రంలోని దాదాపు 70 బిసి గురుకులా లలో తగిన నీటి సౌకర్యం లేదని, వేలాది మంది విద్యార్థులు ఉన్న చోట్ల కనీస వసతులు లేవు అన్నారు. ఈ పరిస్థితులను బిసి కమిషన్ గమనించి, ప్రత్యక్షంగా పరిశీలించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మేము విజప్తి చేశాం. ఈ విద్యార్థుల జీవితాలను కాపాడేందుకు బిసి కమిషన్ ముందుండి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తగిన చర్యలు తీసుకునేలా చూడాలని కోరామన్నారు. దీనికి బిసి కమిషన్ చైర్మన్ సాను కూలంగా స్పందించారని తెలిపారు.
ఆనంద్ గౌడ్ ఎవరూ? ఆయన ఈ డిమాండ్ ఎందుకు చేశారు?
ఆనంద్ గౌడ్ బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా, సామాజిక సేవా కార్యకర్తగా ఉన్నారు. బిసి విద్యార్థులు హాస్టళ్లలో ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ ఆయన ప్రభుత్వాన్ని మౌలిక వసతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు
Read hindi news: hindi.vaartha.com
Read also: Supreme Court: అడవులను కాపాడకుంటే మీరు జైలుకే: సుప్రీంకోర్టు