
Balka Suman: ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంగళవారం విడుదలయ్యారు. ఆయనతో పాటు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్‌లు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి చేసిన ఉదంతంలో అరెస్ట్ అయిన వీరికి, కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు వారిని విడుదల చేశారు.కాగా క్యాతనపల్లి, చెన్నూరు సహా మూడు కేసుల్లో బాల్క సుమన్ కు బెయిల్ మజూరు అయింది.
Read Also: Amanagallu Jatara: తోపులాట జరిగి నిప్పుల గుండంలో పడ్డ భక్తులు
జైలు నుంచి విడుదలైన అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు తమపై లాఠీచార్జ్ చేయడమే కాకుండా, రివర్స్‌లో అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. కేవలం 7 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్, మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు.
నా కొడుకు పుట్టినరోజుకు కూడా నన్ను దూరం చేశారు
జిల్లా అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా, మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యక్తిగత సిబ్బందిలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము ఎన్నడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని, తనను జైలులో పెట్టడం ద్వారా అధికార పార్టీ నాయకుల కడుపు మంట తగ్గిందని అన్నారు. హోలీ పండుగ, తన కుమారుడి పుట్టినరోజున కూడా తనను దూరంగా ఉంచారని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: