సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP) లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తప్పవని, రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. ప్రయాణికులపై భారం మోపేలా ఎవరైనా అధిక ఛార్జీలు వసూలు చేస్తే సంబంధిత బస్సులను సీజ్ చేస్తామని తెలిపారు.
Read also: AP Crime: అనుమానంతో భార్యపై చెంపదెబ్బ కొడితే ప్రాణాలే పోయాయి
ప్రత్యేక దృష్టి
అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీ (AP) కి తిరిగే బస్సులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు.సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ పండుగకు గ్రామాలు, పట్టణాలు, నగరాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతాయి. స్థానికులే కాకుండా బతుకుదెరువుకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారూ తప్పకుండా స్వగ్రామాలకు వస్తుంటారు. బంధు, మిత్రులతో కలిసి ఘనంగా పండుగను చేసుకుంటారు. పిండి వంటలు, కోడి, ఎడ్ల పందేలతో బోగి, సంక్రాంతి, కనుమ మూడ్రోజులపాటు సందడి చేస్తారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: