Amberpet Flyover: హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఫ్లై ఓవర్ కింద సర్వీస్ రోడ్డు నిర్మాణం నిలిచిపోవడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. గతేడాది మే నెలలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించినప్పటికీ, కింద సర్వీస్ రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
Read Also: Telangana: రాష్ట్రంలో రాబోయే 10 రోజులు కరెంట్ కోతలు!

ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి విజ్ఞప్తి.
ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయినప్పటికీ, సర్వీస్ రోడ్డు కోసం జరగాల్సిన భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని కిషన్ రెడ్డి వివరించారు. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ. 2.54 కోట్ల పరిహారాన్ని చెల్లించినప్పటికీ, కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా అడ్డుతగులుతున్నాయని ఆయన ఆరోపించారు.
దీనివల్ల పనులు ముందుకు సాగక ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో కోరారు. తెలంగాణలో 2014 నుంచి ఇప్పటి వరకు 2,800 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించామని… అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా చొరవ చూపి, జీహెచ్‌ఎంసీ, ఆర్అండ్‌బీ అధికారుల ద్వారా ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: