
అలనాటి ప్రముఖ హీరోయిన్ ఆమని (Amani) ఈరోజు కాషాయ కండువా కప్పుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నటి ఆమని (Amani) మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. “మోదీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు.
Read Also: Rajendranagar Accident: పీవీ ఎక్స్ ప్రెస్ వేపై మూడు కార్లు ఢీ.. భారీ ట్రాఫిక్ జామ్
ప్రజాసేవే ప్రధాన లక్ష్యం
భారతీయులమని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కూడా మోదీ కృషి చేస్తున్నారు” అని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలన్న తన నిర్ణయం వెనుక ప్రజాసేవే ప్రధాన లక్ష్యమని ఆమని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: