हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Accident: ప్రమాదంలో చనిపోయిన యువకుడి ఓ విజ్ఞప్తి

Sharanya
Accident: ప్రమాదంలో చనిపోయిన యువకుడి ఓ విజ్ఞప్తి

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వెనుక కారణాలను పరిశీలిస్తే, మానవ తప్పిదాలే ప్రధానంగా ఉన్నాయన్న విషయం స్పష్టమవుతుంది. గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం వేలాదిమంది వ్యక్తులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఈ మరణాలలో చాలావరకు నివారించదగినవే. ముఖ్యంగా హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల యవతలో అనేకమంది తమ యువజీవితాలను కోల్పోతున్నారు. ఎన్ని నిబంధనలు పెట్టినా వాహనదారులు మాత్రం ఉల్లంఘిస్తూనే ఉంటారు. కొందరు తమ నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకుని కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. ఈ విషాద ఘట్టానికి ఉదాహరణగా నిలిచింది నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన.

26 ఏళ్ల యువకుడి మరణం – కుటుంబాన్ని కలచివేసిన విషాదం

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన అంతటి అంజయ్య, సావిత్రమ్మ దంపతులు గీత కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు అజయ్‌ కుమార్‌ గౌడ్‌(26) ఓ ఫార్మసీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇంటికి పెద్ద కొడుకు కావడంతో స్థానికంగా ఉంటూ, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మే నెల 18వ తేదీన వలిగొండలోని ఓ వివాహానికి అజయ్‌ కుమార్‌గౌడ్‌ బైక్‌పై వెళ్లాడు. పెళ్లికి హాజరై రాత్రివేళ వెలిమినేడుకు తిరుగు ప్రయాణమయ్యాడు. వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామ పరిధిలోకి రాగానే బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. దీంతో అజయ్ కుమార్ కాల్వలో పడిపోవటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

చిన్న తప్పిదం – జీవితాంతం తల్లిదండ్రుల గుండెల్లో శూన్యత

ఈ ఘోర ప్రమాదంలో అజయ్ కుమార్ హెల్మెట్ ధరించకపోవడమే అతని మృతికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. తన చేతికి అంది వచ్చిన కొడుకును కళ్ళముందే కోల్పోయిన తల్లిదండ్రులు ఆ విషాదాన్ని మరిచిపోలేక, తమ బాధను ఒక విజ్ఞప్తిగా ప్రజల ముందు ఉంచారు. తల్లిదండ్రులు నిర్వహించిన అజయ్‌ కుమార్‌ గౌడ్‌ దశదినకర్మ కార్యక్రమంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ‘నేను హెల్మెట్‌ ధరించి ఉంటే ఈ రోజు మీ అందరితో కలిసి ఉండేవాడిని బైక్‌ నడిపే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలి’ అంటూ అజయ్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడినట్లుగా కుటుంబ సభ్యులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లను గ్రామంలోని రెండు చోట్లు ఏర్పాటు చేశారు.

హెల్మెట్‌ ధరించకపోతే… ఇలాంటివే ఫలితాలు

ట్రాఫిక్ నిబంధనల ప్రకారం హెల్మెట్ ధరించడం నిబంధన మాత్రమే కాదు – అది ప్రాణానికి రక్షణ కవచం. ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ జరిగేదీ తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎదురుగా వచ్చే వాహనం తప్పు చేస్తే మనం బలైపోతాం. అలాంటి సందర్భాల్లో హెల్మెట్ మన తలకు సంరక్షణ కల్పిస్తుంది. హెల్మెట్‌ ధరించకపోవటంతో రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోయామని, తమకు మిగిలిన కడుపుకోత మరే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు గర్భ శోకం రాకూడదంటే యువకులు హెల్మెట్ ధరించాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యులు రూపొందించిన పోస్టర్‌ పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

Read also: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుఫాను ముప్పు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870